Wealth Creator: తక్కువ సమయంలో పెద్ద ఎత్తున సంపద సృష్టించడానికి మార్కెట్లో పలు మార్గాలున్నాయి. ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ వంటి స్టాక్ మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే రియల్ ఎస్టేట్ ద్వారా కూడా భారీ మొత్తంలో వెనకేసుకోవచ్చని చాలా కొద్ది మందికే తెలుసు.
రియల్ ఎస్టేట్ అనేది పెట్టుబడి ద్వారా సంపద సృష్టికి మంచి అవకాశం ఉన్న రంగం. ఇది స్థిరమైన రాబడిని ఇవ్వడంతో పాటు దీర్ఘకాలిక మూలధన నిర్మాణం వంటి రెండింటినీ అందించే ఆకర్షణీయమైన ఇన్వెస్ట్‌మెంట్ మార్గం. అయితే ఇందుకోసం స్థిరాస్తి మార్కెట్ డైనమిక్ నేచర్‌ను అర్థం చేసుకోవడం ముఖ్యం.

సరైన వ్యూహంతో నివాస, వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. వాటిద్వారా పెద్ద మొత్తంలో అద్దెలు పొందే వీలుంది. పట్టణాలు, మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు దగ్గర్లో పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ వంటి సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తే డిమాండ్‌కు తగిన విధంగా సంపద సృష్టించవచ్చు.
నగరాలు, పట్టణాలకు కొద్దిపాటి దూరంలో తక్కువకు లభించే స్థలాలను కొనుగోలు చేయడం ద్వారా అతి త్వరలో అవికాస్తా విస్తరించి వాటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కొంత రిస్క్ చేయగలిగితే, వివాదాలు ఉన్న ఆస్తులను తక్కువ ఖర్చుతో కొని న్యాయ నిపుణుల సాయంతో ఎక్కువకు విక్రయించి సొమ్ము చేసుకునే వీలుంది.
భూమిపై పెట్టుబడి పెట్టేముందు ఆస్తి ధరలు, ప్రదేశం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు బిల్డర్ కి ఉన్న మంచి పేరును పరిగణలోనికి తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో స్థానిక నిబంధనలు, ఆస్తి పన్నులు మరియు చట్టపరమైన విధానాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్‌ను స్టడీ చేస్తూ, పెట్టుబడి వ్యూహాలను మారుస్తూ బలమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవచ్చు.


Click it and Unblock the Notifications