భారత్ లో రియల్ ఎస్టేట్ రంగం గత కొంత కాలంగా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ రంగంలో మెరుగైన రాబడులకు అవకాశం ఉండటంతో దేశీయ ఇన్వెస్టర్ల తో పాటు విదేశీ పెట్టుబడిదారులు కూడా ఇండియన్ రియల్ ఎస్టేట్ పై కన్నేశారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు కుమ్మరించారు. అందుకు తగిన ప్రతిఫలాలు కూడా పొందారు.
కానీ, గత రెండు నెలలుగా దేశంలో నెలకొన్న పరిణామాలు ఈ రంగానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి, రాబడుల కోసం ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటి అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా భారత రియల్ ఎస్టేట్ రంగానికి 2018, 2019 బాగా కలిసొచ్చాయి. పెద్ద పెద్ద విదేశీ కంపెనీలు కూడా మన దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో స్థానిక భాగస్వాములతో కలిసి జాయింట్ ప్రాజెక్టులను చేపట్టాయి. కొన్ని కంపెనీలు కేవలం 1-2 ఏళ్లలోనే రూ వందల కోట్ల లాభాలను కళ్లచూశాయి.

2019 లో 6 బిలియన్ డాలర్లు...
భారత రియల్ ఎస్టేట్ రంగం 2019 లో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆ ఒక్క ఏడాదిలోనే ఈ రంగం ఏకంగా రూ 6 బిలియన్ డాలర్ల (రూ 45,000 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. 2018 తో పోల్చితే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు 27% పెరగటం విశేషం. కార్యాలయ స్థలాలు, ఓపెన్ ల్యాండ్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో మొత్తం పెట్టుబడుల్లో ఈ సెగ్మెంట్ల లోకి సుమారు 40% వరకు నిధులు వచ్చి పడ్డాయి.
ఈ మొత్తం పెట్టుబడుల్లో విదేశీ పెట్టుబడిదారుల వాటా కూడా భారీగా ఉండటం విశేషం. ఫారిన్ ఇన్వెస్టర్ల వాటా 65% గా నమోదయింది. దీన్ని బట్టే రియల్ ఎస్టేట్ రంగానికి ఎంత డిమాండ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ సిబిఆర్ఈ సౌత్ ఆసియ ప్రైవేట్ లిమిటెడ్ ఒక నివేదిక ను విడుదల చేసింది.

గేట్ వే సిటీలు ఇవే...
భారత రియల్ ఎస్టేట్ రంగంలో ధృవ తారలుగా కొన్ని ప్రధాన నగరాలు నిలిచాయి. అందులో మన హైదరాబాద్ కూడా ఉండటం విశేషం. 2019 లో వచ్చిన పెట్టుబడుల్లో సింహభాగం ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎన్ సి ఆర్, బెంగళూరు మహానగరాలు ఆకర్షించాయి. ఈ నగరాల్లో ఆఫీస్ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అలాగే కొత్త ప్రోజెక్టుల కోసం ఓపెన్ ల్యాండ్స్ కొనుగోళ్లు పెరిగాయి. ఈ మహానగరాల్లో కొత్తగా చాలా హోటల్స్ కూడా ఏర్పాటయ్యాయి.
హోటల్స్ నిర్మాణ ప్రోజెక్టుల కోసం సుమారు 11% నిధులు రాగా... ఆఫీస్ స్పేసేస్ ప్రాజెక్టులు, ల్యాండ్ ప్రోజెక్టుల విభాగానికి 39% చొప్పున పెట్టుబడులు సమకూరాయి. దీంతో ఈ నగరాల్లో అన్ని రకాల రియల్ ఎస్టేట్ స్పేస్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చింది. డిమాండ్ కూడా అధికంగా ఉండటంతో దీర్ఘకాలిక లీజులు, కాంట్రాక్టులు పెద్ద ఎత్తున సాగాయి.

ఈ ఏడాది ఎలా?
ఇంత వరకు బాగానే ఉంది. కానీ, 2020 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమిటా అని విశ్లేషకులు తలలు పట్టుకొంటున్నారు. ఇప్పటికే 7 ప్రధాన నగరాల్లో తగినన్ని ఇండ్లు, ఆఫీస్ స్పేస్, రిటైల్ స్పేస్ సిద్ధంగా ఉండటం తెలిసిందే. ఇవి పూర్తిగా అమ్ముడు పోకుంటే కొత్త ప్రాజెక్టులు వెంటనే చేపట్టడం సాధ్యం కాదు. కానీ, పరిస్థితి చూస్తుంటే మరో 6-9 నెలల పాటు సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం కనిపించటం లేదు.
కొనుగోళ్లు మందగిస్తే ధరలు కూడా తగ్గుతాయి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కనీసం 20% తక్కువ ధరకే ఇండ్లను విక్రయించి నిధుల లభ్యతను సాధించాలని పెద్ద పెద్ద బ్యాంకుల చైర్మన్లు సూచిస్తున్నారు. ఈ సూచనను డెవలపర్లు ఆచరిస్తారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ఒక వేల ధరలు 20-25% తగ్గితే మాత్రం ... ఎప్పటి నుంచో ఇల్లు కొనుగోలు చేయాలని కొనలేక పోయినవారు ఇటు వైపు దృష్టి సారించవచ్చు. లేదంటే రియల్ ఎస్టేట్ రంగానికి 2020 గడ్డు కాలమేనని విశ్లేషకుల అంచనా.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications