Real Estate: బడ్జెట్లో నిర్మలమ్మ నుంచి రియల్టీ రంగం కోరుకుంటోంది ఇదే..!
Union Budget 2025: జనవరి నెల దాదాపు చివరికి వచ్చేసింది. ఇప్పుడు దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్ స్పీచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే రాబోయే బడ్జెట్ నుంచి రియల్ ఎస్టేట్ రంగం నుంచి కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు బడ్జెట్ పెద్ద సవాళ్లనే నిలిపింది. నిధులను అభివృద్ధి కోసం కేటాయించాలా, వివిధ రంగాలకు ఎక్కువ పంచాలా లేక ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి ఉపయోగించాలా అనే సందిగ్ధత కొనసాగుతోంది. వీటన్నిటికంటే తోడు క్యాపెక్స్ ఎంత మేర పెంచుతారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక పోతే పరిశ్రమలు కూడా ప్రోత్సాహకాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఖర్చు చేసేందుకు ప్రజల ఆదాయాలను పెంచటం కోసం పన్నుల తగ్గింపు కూడా ఇప్పటికే నిర్మలమ్మ టేబుల్ పై ఉన్న సంగతి తెలిసిందే.

ఇలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ రంగం నుంచి కూడా భారీగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2024 రెండవ అర్థభాగంలో రియల్టీ కార్యకలాపాలు మందగించాయి. ఈ రంగంలో వృద్ధి నెమ్మదించటంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం వినియోగాన్ని పునరుద్ధరిస్తాయని రంగం ఆశిస్తున్నట్లు ఎన్‌రాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి పేర్కొన్నారు.
ఇదే క్రమంలో గృహ కొనుగోలుదారులతో పాటు డెవలపర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించాలని కాన్షియస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ హెడ్ మోహిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో మార్కెట్లో లిక్విడిటీని పెంచేందుకు ప్రోత్సాహకాలను చేర్చాలన్నారు. ప్రధానంగా కొనుగోలుదారులతో పాటు వ్యాపారుల నుంచి కూడా టాక్సుల విషయంలో చాలా కాలంగా ఉన్న డిమాండ్లను ప్రభుత్వం పక్కన పెడుతూనే ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒకప్పుడు మంచి వృద్ధిని చూసిన ఈ రంగం కరోనా తర్వాత ఇబ్బందులను ఎదుర్కొంటోందని అనరాక్ గ్రూప్‌కు చెందిన పూరి పేర్కొన్నారు. ప్రధానంగా రూ.40 లక్షల కంటే తక్కువ రేటులో ఉండే అఫోర్డబుల్ కేటగిరీ నివాసాలకు డిమాండ్ సరఫరాల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా కాలం నుంచి దేశంలోని ప్రజల్లో సొంత ఇళ్లు ఉండాలనే కోరిక పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం అనేక మెట్రో నగరాల్లో లగ్జరీ, అధిక ధర కలిగిన గృహాలను డెవలప్ చేసేందుకు రియల్టీ కంపెనీలు మెుగ్గుచూపుతున్నాయి. మార్కెట్లో ప్రజల ఆదాయాలు పెరగటం కూడా దీనికి కారణంగా ఉంది.
బడ్జెట్ 2025లో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి మరియు స్థిరత్వం కోసం ప్రభావవంతమైన చర్యల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మానిక్ మాలిక్, CFO, BPTP ప్రేకొన్నారు. అలాగే పరిశ్రమ గృహ కొనుగోలుదారులకు మెరుగైన పన్ను ప్రయోజనాలను కోరుకుంటున్నట్లు వైట్‌ల్యాండ్ కార్పొరేషన్ డైరెక్టర్, సుదీప్ భట్ అభిప్రాయపడ్డారు. స్థిరమైన అభివృద్ధి, పెరిగిన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించే విధానాలు ఆర్థిక వృద్ధికి సహాయపడటమే కాకుండా గృహాలకు డిమాండ్ పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications