కరోనా మహమ్మారి కారణంగా, లాక్ డౌన్ ప్రభావంతో మొన్నటిదాకా డీలా పడిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కరోనా కారణంగా దెబ్బతింది. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో మాత్రం ప్రస్తుతం అంత తీవ్ర ప్రభావం లేదని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మార్కెట్ తో రియల్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నష్టాల్లోనే రియల్ రంగం .. ప్రాపర్టీ సంస్థల నివేదికలు .. కానీ
రియల్ ఎస్టేట్ రంగంపై కరోనా పై తీవ్ర ప్రభావం నెలకొందని, ఊహించని విధంగా రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లో మునిగిపోయిందని పలు సంస్థలు నివేదికలు ఇచ్చాయి . భవిష్యత్ లో కూడా అంత త్వరగా కోలుకునే పరిస్థితులు లేవని పలు ప్రాపర్టీ సంస్థలు నివేదికలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ రిపోర్ట్స్ ను తలకిందులు చేస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. అనరాక్, నైట్ ఫ్రాంక్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలు దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని, భూముల ధరలు తగ్గాయని ప్రకటించాయి.

క్షేత్ర స్థాయిలో లేని ప్రభావం .. జోరుగానే కొనుగోళ్ళు
క్షేత్రస్థాయిలో అటువంటి ప్రభావం లేదని బిల్డర్లు, డెవలపర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. కరోనా కారణంగా దేశమంతా అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గినా అందుకు భిన్నంగా హైదరాబాద్ మార్కెట్ ఉంది. లాక్ డౌన్ సమయంలో ఎవరు బయటికి రాకపోవడంతో అమ్మకాలు తగ్గాయని, ప్రస్తుతం భూములు, ఫ్లాట్ల కొనుగోలు కోసం కస్టమర్లు బాగానే వస్తున్నట్లుగా చెప్తున్నారు. అంతేకాదు ధరలు తగ్గించాల్సిన అవసరం కూడా రాలేదని రియల్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది.

దారుణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందని అనరాక్ అంచనా
ఒకపక్క పూణే, ముంబై, చెన్నై, బెంగళూర్, కలకత్తా వంటి ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటే, హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుంది. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అమ్మకాలు 85% తగ్గుతాయని అనరాక్ కన్సల్టెన్సీ ప్రకటించింది . అంతే కాదు 2020 - 21 మొదటి మూడు నెలల క్వార్టర్ లో కొత్త ఇళ్ళ అమ్మకాలు ,ఫ్లాట్ల అమ్మకాలు 660 కి మించవని అంచనావేసింది.

అంచనాలు తారుమారు .. హైదరాబాద్ లో పుంజుకున్న రియల్ ఎస్టేట్
ఆ అంచనాలను తారుమారు చేస్తూ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. కరోనా ప్రభావం కూడా తగ్గడంతో నిదానంగా వ్యాపారం పుంజుకుంటోందని రియల్టర్లు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ప్రస్తుతం రియల్టర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కాస్త కోలుకోవటం తెలంగాణా రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి కాస్త ఊరట . హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలో వరంగల్ తదితర ప్రధాన నగరాల్లో కూడా మార్కెట్ నిదానంగా పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు .
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications