ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త! కరోనా మహమ్మారి కారణంగా ప్రజాజీవనం స్తంభించింది. దీంతో ఉత్పత్తి, డిమాండ్ పడిపోయింది. కరోనా వల్ల కోట్లాది ఉద్యోగాలు పోతాయనే ఆందోళనతో పాటు కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయనే అంచనాలు కూడా ఉన్నాయి. అలాగే, ఈ పరిస్థితి ఆధారంగా వాహనాల కొనుగోళ్లు పెరుగుతాయని ఆటో మార్కెట్ అంచనా వేస్తోంది. కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా రూ.1 లక్ష కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే ఇళ్లు కొనుగోలు చేసే వారికి మాత్రం ఇది వరంగా మారనుందట.

ఇండ్ల ధరలు 20 శాతం వరకు తగ్గొచ్చు
కరోనా దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతిన్నదని, మరో 6 నెలల వరకు కోలుకునే సూచనలు లేవని HDFC చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. దీంతో ఇండ్ల ధరలు 20% వరకు తగ్గవచ్చునని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాతినిధ్యం వహించే క్రెడాయ్, నరెడ్కో సంఘాల ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

10 శాతం నుండి 15 శాతం తగ్గొచ్చు కానీ
రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయని, నరేడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) అంచనా 10 శాతం నుండి 15 శాతం ఉంటుందని చెబుతోందని, అయితే 20 శాతానికి కూడా సిద్ధంగా ఉండాలని దీపక్ పరేఖ్ అన్నారు.

వారికి అద్భుత అవకాశం
ఉద్యోగ భద్రత ఉన్నవారు లేదా చేతిలో నగదు ఉన్నవారికి కరోనా తర్వాత మంచి అవకాశమని దీపక్ పరేఖ్ అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్ కచ్చితంగా ముఖ్యమైన అసెట్ అని, ప్రపంచంలోనే అన్ని స్టాక్స్, బాండ్స్ వ్యాల్యూ కంటే రియల్ ఎస్టేట్ విలువ ఎక్కువగా ఉంటుందన్నారు.

రియల్ రంగానికి ప్రతికూలత
ఆర్థికపరమైన ఒత్తిళ్లు, నిరర్థక ఆస్తులు, కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ వంటి వివిధ కారణాలతో ఇప్పటికే భారత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆందోళనకరంగా ఉందని అన్నారు. ప్రభుత్వం సరసమైన గృహాలకు వివిధ మార్గాల ద్వారా ప్రోత్సాహకాలు ప్రకటించిందన్నారు. ఆర్థిక మందగమనంతో పాటు ఇప్పుడు కరోనా వల్ల రియల్ రంగానికి ప్రతికూలత ఎదురవుతోందన్నారు.

జాగ్రత్త.. డెవలపర్లకు HDFC హెచ్చరిక
ఇండియా రేటింగ్ ఏజెన్సీ ప్రకారం 2017-19 మధ్య రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకుందని, 2019-20లో తగ్గుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. డెవలపర్లను కూడా దీపక్ పరేఖ్ హెచ్చరించారు. సమయం బాగుంటే మీ లాభాలు పెంచుతుందని, బ్యాడ్ టైమ్ అయితే మిమ్మల్ని ముంచుతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మారటోరియంపై సూచన..
మారటోరియంపై కూడా దీపక్ పరేఖ్ సూచన చేశారు. దీనిని చివరి ఆప్షంగా మాత్రమే ఉపయోగించుకోవాలన్నారు. డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం కంటే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం మంచిదని సూచించారు. ఇంటికి అయ్యే ఖర్చులు తగ్గించే ప్రయత్నాలు చేయాలని, ఖర్చుపై అదుపు ఉండాలని సూచించారు.

భారత్, చైనా, ఇండోనేషియా మాత్రమే పాజిటివ్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు ఇంత త్వరగా కుంచించుకు పోలేదని పరేఖ్ అన్నారు. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ క్యాలెండర్ ఇయర్లో 2 శాతానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారన్నారు. G20 దేశాల్లో చైనా, ఇండియా, ఇండోనేషియా మాత్రమే పాజిటివ్ వృద్ధిని నమోదు చేస్తాయని చెబుతున్నారని గుర్తు చేశారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications