Real estate: ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఆగండి! రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెను మార్పులు రాబోతున్నాయి

గత కొన్ని ఏళ్లుగా రియల్ ఎస్టేట్(Real estate) మార్కెట్ చూస్తుంటే సామాన్యుడికి గుండె దడ పుడుతోంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, 3 BHK, 4 BHK లగ్జరీ ఫ్లాట్లు, ఆకాశాన్ని తాకే ధరలు.. ఇవే కనిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు సీన్ మారుతోంది! మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం, రియల్ ఎస్టేట్ సైకిల్ మళ్ళీ వెనక్కి తిరుగుతోంది. ఇన్నాళ్లూ లగ్జరీ వెనక పడ్డ బిల్డర్లు, మళ్ళీ మన 'మధ్యతరగతి' మనుషులను గుర్తుచేసుకోక తప్పని పరిస్థితి వస్తోందట.

Real estate market focus on affordable middle class housing as luxury home demand down

లగ్జరీ మోజులో పడి సామాన్యుడిని మరిచారు!

కోవిడ్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. స్టాక్ మార్కెట్‌లో లాభాలు రావడమో, స్టార్టప్స్ పుంజుకోవడమో కారణం ఏదైనా.. జనం పెద్ద ఇళ్ల కోసం ఎగబడ్డారు. దీంతో బిల్డర్లు కూడా 1BHK, 2BHK వంటి చిన్న ఇళ్లను పక్కన పెట్టేసి, కేవలం కోట్లలో ధర పలికే 3-4 BHK ఫ్లాట్ల మీదనే దృష్టి పెట్టారు. ముంబై లాంటి నగరాల్లో చూస్తే 2025లో 1BHK లాంచ్‌లు ఏకంగా 50 శాతం తగ్గిపోయాయి. ఎక్కడో దూరంగా ఉన్న థానే, మీరా రోడ్ లాంటి ఏరియాల్లో కూడా చిన్న ఇల్లు కొనాలంటే కోటి రూపాయల పైనే ఖర్చవుతోంది.

బిల్డర్లకు లాభాలు.. సామాన్యుడికి భారం

ఎందుకు బిల్డర్లు పెద్ద ఇళ్లకే మొగ్గు చూపుతున్నారంటే, అందులో మార్జిన్లు ఎక్కువ. చిన్న ఇల్లు కడితే వచ్చే లాభం కంటే, లగ్జరీ ఇల్లు అమ్మితే వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ముంబై లాంటి చోట కొత్త అపార్ట్‌మెంట్ సగటు ధర ఇప్పుడు రూ. 3 కోట్లకు చేరుకుంది. అసలు మధ్యతరగతి కుటుంబం అంటేనే ముంబై మర్చిపోయింది అనే విమర్శలు వస్తున్నాయి. కేవలం ధనవంతులకు మాత్రమే ఇళ్లు కడితే, రేపు మార్కెట్ స్లో అయినప్పుడు ఎవరు కొంటారు? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

ఇల్లు కాదు.. అదొక పంజరం!

ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ఇళ్ల పరిస్థితి ఎలా ఉందంటే, కోటి రూపాయలు పెట్టినా అవి ఒక పంజరంలాగే అనిపిస్తున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. ఇరుకైన కిచెన్లు, ఇబ్బందికరమైన బాత్‌రూమ్‌లు, బాల్కనీలు లేకపోవడం, ఇక పార్కింగ్ సమస్యల గురించి అయితే చెప్పక్కర్లేదు. కొన్ని చోట్ల 450 చదరపు అడుగుల 1BHK ఇంటినే బిల్డర్లు తెలివిగా 2BHK అని మార్కెటింగ్ చేస్తున్నారట. అంటే లోపల స్థలం పెరగదు కానీ, పేరు మాత్రం మారిపోతుంది!

రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్ళీ గాడిలో పడుతుందా?

కేవలం ముంబై మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, 2026 నాటికి ఈ లగ్జరీ క్రేజ్ తగ్గి, మళ్ళీ డిమాండ్ పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకుడు విశాల్ భార్గవ చెబుతున్నారు. అమ్మకాలు నెమ్మదించినప్పుడు, బిల్డర్లు కచ్చితంగా తమ పద్ధతి మార్చుకోవాలి. మధ్యతరగతికి అందుబాటులో ఉండే బడ్జెట్ హోమ్స్ (Affordable Housing) మీద దృష్టి పెట్టాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం నిలబడుతుంది.

నిజానికి సామాన్యుడి కొనుగోలు శక్తి పెరగలేదు కానీ, ఇళ్ల ధరలు మాత్రం రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాయి. రియల్ ఎస్టేట్ (Real estate) మార్కెట్ మళ్ళీ "రియాలిటీ" లోకి రావాలంటే, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి రావాల్సిందే. మరి బిల్డర్లు తమ పంతం వీడి చిన్న ఇళ్లను కడతారో లేదో చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+