Real Estate News : భారత్ లోని ప్రధాన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో గృహ కొనుగోలు రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జెఎల్‌ఎల్ (JLL) తాజా నివేదిక ప్రకారం.. ఏడు ప్రధాన నగరాల్లో రూ.1 కోటి కంటే తక్కువ ధరలో ఉండే మిడ్-ఇన్‌కమ్, అఫోర్డబుల్ అపార్ట్‌మెంట్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి అర్థభాగంలో 32 శాతం పడిపోయాయి.ఇదే కాలంలో ప్రీమియం అపార్ట్‌మెంట్లలో అమ్మకాలు 5 శాతం పెరిగాయి.
2025 జనవరి నుండి జూన్ వరకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా వంటి ఏడు ప్రధాన నగరాల్లో మొత్తం అపార్ట్‌మెంట్ అమ్మకాలు ఏడాది వారీగా 13 శాతం తగ్గి 1,34,776 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ. 1 కోటి కంటే తక్కువ ధరలో ఉన్న అపార్ట్‌మెంట్ల అమ్మకాలు 32 శాతం తగ్గి 51,804 యూనిట్లకు చేరాయి. అదే సమయంలో రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన ప్రీమియం గృహాల అమ్మకాలు 82,972 యూనిట్లకు చేరి 6 శాతం పెరిగాయి.

జెఎల్‌ఎల్ నివేదిక ప్రకారం.. 2025 తొలి అర్ధభాగంలో మొత్తం అమ్మకాలలో 62 శాతం ప్రీమియం గృహాలదే కాగా..ఇది గత సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 51 శాతం వాటా కంటే గణనీయమైన పెరుగుదలగా ఉంది. మాస్ సెక్టార్ (రూ. 1 కోటి కంటే తక్కువ) వాటా 49 శాతం నుంచి 38 శాతానికి పడిపోయింది. జెఎల్‌ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ సమంతక్ దాస్ ప్రకారం.. ప్రీమియం గృహాల డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలు కొనుగోలుదారుల ఆర్థిక స్థిరత్వం, జీవనశైలి అప్‌గ్రేడ్ అవసరాలు, పెద్ద, లగ్జరీ స్థలాలపై పెరుగుతున్న ఆసక్తిగా చెబుతున్నారు. లగ్జరీ ఇళ్ల అమ్మకాలు స్థిరంగా వృద్ధి చెందడం, కొనుగోలుదారులకు పెరుగుతున్న సామర్థ్యం, మెరుగైన జీవన ఆకాంక్షలకు నిదర్శనంగా ప్రీమియం ప్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. ప్రీమియం ప్రాపర్టీల పట్ల పెరుగుతున్న దృష్టి మాస్ హౌసింగ్ విభాగంలో కార్యకలాపాలకు ప్రాధాన్యం తగ్గుతోందని జేఎల్‌ఎల్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సమంతక్ దాస్ తెలిపారు.
స్టెర్లింగ్ డెవలపర్స్ CMD రమణి శాస్త్రి మాట్లాడుతూ, తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు, ప్రభుత్వం, RBI నుండి నిరంతర పాలసీ మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మార్కెట్‌కు బలాన్నిస్తోందని చెబుతున్నారు. గురుగ్రామ్‌లో లగ్జరీ సెగ్మెంట్‌లో ఎక్కువ సరఫరా రావడం వల్ల HNIలు (High Net-worth Individuals), NRIలు, కొత్త తరం సంపద సృష్టికర్తల నుండి డిమాండ్ పెరిగిందని ఇన్‌ఫ్రామంత్ర స్థాపకుడు శివాంగ్ సూరజ్ పేర్కొన్నారు.
BCD గ్రూప్ CMD అంగద్ బేడి తెలిపిన వివరాల ప్రకారం.. రికార్డు స్థాయిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కారణంగా నివాస గృహాల డిమాండ్ ప్రధాన నగరాల్లో పెరుగుతోంది. ప్రాపర్టీ ఫస్ట్ CEO భవేష్ కొఠారి, నివాస మార్కెట్లో "ప్రీమియమైజేషన్" ధోరణి వేగంగా పెరుగుతోందని చెబుతున్నారు. M5 మహేంద్ర గ్రూప్ మార్కెటింగ్ హెడ్ యతీష్ కుమార్ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడంతో అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (HNIs) మరియు అల్ట్రా-HNIs పెరుగుతున్నారని, వారు లగ్జరీ, కనెక్టివిటీ మరియు ప్రత్యేకత ఉన్న హై-ఎండ్ గృహాలపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు.
క్లుప్తంగా చెప్పాలంటే.. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు లగ్జరీ, ప్రీమియం గృహాల వైపు వెళుతోంది.దీంతో మాస్ మార్కెట్ స్లోడౌన్‌లో పడింది.2025 రెండో అర్ధభాగంలో కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశం అయితే ఉంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

ప్రాప్‌షేర్ సెలెస్టియా REIT ఐపీఓ: నేడే చివరి అవకాశం!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

హైదరాబాద్ నీటి కష్టాలు: ఐటీ కారిడార్‌లో అద్దెలు ఆకాశానికి!

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా?

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications