టాప్ నగరాల్లో 7 శాతం పెరిగిన లగ్జరీ ఇళ్ల అమ్మకాలు.. 12 ఏళ్లలో హైయెస్ట్...
స్థిరమైన వడ్డీ రేట్లు, దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి మధ్య ప్రీమియం హౌసింగ్‌కు మంచి డిమాండ్ కారణంగా 2024లో ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు సంవత్సరానికి ఏడు శాతం పెరిగి 12 సంవత్సరాల గరిష్ట స్థాయి 3,50,613 యూనిట్లకు చేరుకున్నాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఈ సమాచారాన్ని అందించింది. అయితే, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ గత నెలలో ఏడు ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్ ఇళ్ల అమ్మకాలు 2024లో నాలుగు శాతం క్షీణించి దాదాపు 4.6 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని నివేదించింది.
రెండు నుంచి ఐదు కోట్ల రూపాయల ధర
మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ భారతీయ హౌసింగ్ మార్కెట్‌లో రూ. 2 నుండి 5 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లకు గట్టి డిమాండ్ కనిపించింది. హైదరాబాద్, పుణెలలో డిమాండ్ ఆల్ టైమ్ హైకి చేరుకోగా, ముంబైలో ఇది 13 ఏళ్లలో అత్యధికం అని అన్నారు.

85 శాతం వార్షిక వృద్ధి
"రూ. 2-5 కోట్ల కేటగిరీలోని ఇళ్ల డిమాండ్‌లో 85 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి, అయితే రూ. 50 లక్షల కన్నా తక్కువ ధర అలాగే రూ. 50 లక్షలనుండి రూ. 1 కోటి ధర ఉన్న ఇళ్లకు డిమాండ్ లేదా అమ్మకాలు తగ్గాయి" అని కన్సల్టెంట్ తేలిపింది.
2020 నుండి అద్భుతమైన జంప్
2020 నుండి రెసిడెన్షియల్ మార్కెట్ విపరీతమైన పెరుగుదలను చూసిందని, 2024లో అమ్మకాల సైజ్ 12 సంవత్సరాల గరిష్టానికి చేరుకుంటుందని బైజల్ చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెంట్ నుండి ఈ డేటా ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR), బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణె, అహ్మదాబాద్ ఇంకా కోల్‌కతా మార్కెట్‌ల ఆధారంగా అందించింది.
"రెసిడెన్షియల్ మార్కెట్‌లో మొమెంటం 2024లో బాగా పెరిగింది. 2024 సంవత్సరం Q3లో అత్యధిక త్రైమాసిక విక్రయాలను 87,108 యూనిట్లుగా నమోదైంది" అని ఒక నివేదికలో పేర్కొంది. వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ద్వారా నైట్ ఫ్రాంక్ ఇండియా సిఎండి శిశిర్ బైజల్ మాట్లాడుతూ రూ. 1 కోటి కంటే ఎక్కువ ధరతో కూడిన ప్రీమియం హౌసింగ్‌కు డిమాండ్ కారణంగా హౌసింగ్ విక్రయాలలో వృద్ధి నమోదైంది అని అన్నారు.
నివేదిక ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సిఆర్ మినహా అన్ని మార్కెట్‌లో గృహాల సేల్స్ పెరిగాయి, కానీ ఢిల్లీలో అమ్మకాలు సంవత్సరానికి 7 శాతం తగ్గాయి. ముంబైలో అత్యధికంగా అమ్మకాలు నమోదుకాగా, ఇది మార్కెట్‌కి కొత్త గరిష్టం. ముంబైలో అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 9 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications