కరోనా మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ రంగం కోలుకోవడానికి దాదాపు ఏడాది పట్టవచ్చునని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. కోవిడ్ 19 దెబ్బకు ఇప్పటికే వివిధ రంగాలతో పాటు రియాల్టీ రంగంలోను పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. వేతనాల కోత కనిపించింది. మరిన్ని ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయట.

అమ్మకాల్లో నిస్తేజం
వివిధ రంగాల్లో ఉద్యోగాల కోత, వేతనాల కోత, వేతనాలు లేకుండా సెలవులు వంటి నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగంపై భారీ ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. కరోనా కారణంగా అత్యవసర, నిత్యావసర వస్తువులు మినహా మిగతా వాటిని వాయిదా చేసుకుంటున్నారు. ఖరీదైన ఇంటి కొనుగోలు కూడా వాయిదానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రంగం కోలుకోవడానికి ఏడాది కాలం పట్టవచ్చునని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. రాబోయే కొద్ది నెలలు అమ్మకాలు స్తబ్దుగా ఉంటాయని భావిస్తున్నారు.

మరో 2 లక్షల మందికి ప్రమాదం
మూడు నాలుగేళ్లుగా జీఎస్టీ, నియంత్రణ చట్టం రెరా ఇబ్బంది ఎదుర్కొంటున్న రియాల్టీ రంగం నెత్తిన కరోనా పిడుగు పడింది. వాటన్నింటి కంటే ఇది అతిపెద్ద సవాల్‌గా మారింది. కార్యాలయ ఉద్యోగులు సహా ఈ రంగం దాదాపు డెబ్బై లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. వివిధ సంస్థల అంచనా ప్రకారం ఇప్పటికే ఈ రంగంలో 60,000 ఉద్యోగాలు పోయాయి. మరో 2 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని అంచనా.

వేతనం లేని సెలవులు
పరిస్థితులు మెరుగుపడకుంటే రానున్న మూడు నాలుగు నెలల్లో ముప్పైవేల మంది వైట్ కాలర్ ఉద్యోగులకు ప్రమాదం ఉందని భావిస్తున్నారు. చాలామంది డెవలపర్లు నగదు లభ్యత సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొంతమంది ఆఫీస్‌లు క్లోజ్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే పరిస్థితి ఉండవచ్చునని, వచ్చే ఏడాదికి గానీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. రియాల్టీ రంగంలో 15 శాతం నుండి 20 శాతం వరకు కోతలు ఉన్నాయి. కొంతమందిని వేతనం లేని సెలవులపై పంపిస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా సేల్స్ తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 27 శాతం వరకు ఆదాయం కోల్పోయారు. జూలైలోను పరిస్థితి ఇలాగే ఉంటే 35 శాతం దాటుతుందని అంచనా.

ఇంటి కొనుగోలుకు దూరం
పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ 21 శాతం బయ్యర్స్ వచ్చే ఆరు నెలల నుండి 12 నెలల్లో తిరిగి మార్కెట్‌లోకి రావొచ్చునని, 70 శాతానికి పైగా ఇంటి కొనుగోలును దూరం పెట్టవచ్చునని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది పెట్టుబడిదారులు వేచి చూసేందుకు ఇష్టపడతారంటున్నారు. ఓ సర్వేలో దాదాపు 94 శాతం మంది తాము ఇంటి కొనుగోలుపై వేచి చూస్తామని చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications