ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల కొనుగోలు ప్రక్రియ వేగంగా మారుతోంది. ముఖ్యంగా అమెరికాలో చాలా మంది కుటుంబాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో తమ కలల ఇంటిని వెతుక్కుంటున్నాయి. పర్సనలైజ్డ్ ప్రాపర్టీ సిఫార్సులు, వర్చువల్ టూర్లు, ఆటోమేటెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఏజెంట్ల అవసరం లేకుండానే పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఇక్కడి రియల్ ఎస్టేట్ (real estate) రంగంలోనూ మొదలైంది. ఏజెంట్లు లేకుండా, భారీగా బ్రోకరేజ్ ఫీజులు చెల్లించకుండా ఇల్లు కొనడం భారత్ లో సాధ్యమేనా? అంటే నిపుణులు 'అవును' అనే సమాధానం వస్తోంది.

మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ డీల్స్
భారతదేశంలో 'నో బ్రోకర్' (NoBroker), 'హౌసింగ్ డాట్ కామ్' (Housing.com) వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇల్లు కొనేవారిని నేరుగా యజమానులతో అనుసంధానం చేస్తున్నాయి. ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా మీకు నచ్చిన ఏరియాలో, మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా ఇళ్లను ఈజీగా షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల బ్రోకరేజ్ ఫీజులను అంటే లక్షల రూపాయలను ఆదా చేసే అవకాశం ఉంటుంది. కేవలం రెడీ-టు-మూవ్ ఇళ్లే కాకుండా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులను కూడా డెవలపర్ వెబ్‌సైట్లు లేదా రేరా (RERA) పోర్టల్స్ ద్వారా నేరుగా పరిశీలించవచ్చు.
ఏజెంట్ లేకుండా కొనేముందు చేయాల్సిన పనులు
ఏజెంట్ లేనప్పుడు పూర్తి బాధ్యత కొనుగోలుదారుడిదే ఉంటుంది. కాబట్టి పక్కా ప్లానింగ్ అవసరం..
- బడ్జెట్ నిర్ణయం: డౌన్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, లోన్ ఎలిజిబిలిటీని ముందుగానే అంచనా వేయాలి.
- ప్రభుత్వ పథకాలు: మొదటిసారి ఇల్లు కొనేవారు పీఎంఏవై (PMAY) వంటి సబ్సిడీలను తనిఖీ చేయాలి.
- ప్రాపర్టీ సెర్చ్: నో బ్రోకర్, మ్యాజిక్ బ్రిక్స్ లేదా 99 ఏకర్స్ వంటి సైట్లలో 'డైరెక్ట్ ఓనర్' లిస్టింగ్స్ మాత్రమే వెతకాలి.
లీగల్ వెరిఫికేషన్: అత్యంత కీలకం
ఏజెంట్ లేనప్పుడు లీగల్ అంశాలపై అప్రమత్తంగా ఉండాలి. రేరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెక్ చేయాలి. అలాగే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (EC), ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ (NOC), మున్సిపల్ అప్రూవల్స్ వంటివి స్వయంగా పరిశీలించాలి. మీరు ఏజెంట్ ఫీజు ఆదా చేస్తున్నప్పుడు, ఆ డబ్బులో కొంచెం ఖర్చు పెట్టి ఒక నిపుణుడైన లాయర్‌ను సంప్రదించడం మంచిది. టైటిల్ సెర్చ్ ద్వారా ఆ ప్రాపర్టీకి ఎలాంటి వివాదాలు లేవని నిర్ధారించుకోవాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ
ఇల్లు నచ్చాక.. టోకెన్ అమౌంట్ చెల్లించి అలాట్‌మెంట్ లెటర్ తీసుకోవాలి. సేల్ అగ్రిమెంట్ పత్రాలను జాగ్రత్తగా చదివి సంతకం చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను సబ్- రిజిస్ట్రార్ కార్యాలయంలో చెల్లించాలి. మొత్తం పేమెంట్లను బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారానే చేయడం సురక్షితం.
కొత్త శకం మొదలైందా?
ఏదేమైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో భారతీయ రియల్ ఎస్టేట్ (real estate) రంగంలో పారదర్శకత పెరిగింది. ఒకప్పుడు ఏజెంట్లు చెప్పిందే వేదంగా ఉండేది. కానీ, ఇప్పుడు ప్రతి సమాచారం మన చేతుల్లోని మొబైల్ లోనే అందుబాటులో ఉంది. సరైన అవగాహన, కొంచెం ఓపిక ఉంటే ఏజెంట్ సహాయం లేకుండానే మీ కలల ఇంటిని సొంతం చేసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications