హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. హైటెక్ సిటీ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మరో ప్రదేశం వెలుగులోకి వచ్చింది. ఈ ఏరియాలో ఐటీ పార్కులు, మెట్రో కనెక్టివిటీ, వాణిజ్య కార్యాలయాలు, విద్యా సంస్థలు, హౌసింగ్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతం భవిష్యత్తులో భారీగా రియాల్టీ మార్కెట్ ఎదుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నగరంలోని అన్ని ప్రాంతాలను కలిపే రహదారులు ఇక్కడ ఉండడంతో భూమి ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు పెట్టుబడి చేస్తే వచ్చే సంవత్సరాల్లో విశేష లాభాలు పొందవచ్చునని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంటి కొనుగోలు లేదా ప్లాట్ కొనుగోలు చేయాలనుకునే వారికీ ఇది ఉత్తమ అవకాశంగా మారనుంది.

హైదరాబాద్ లోని పశ్చిమ ప్రాంతం ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం తూర్పు ప్రాంతాన్ని ఐటీ కారిడార్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే భాగ్యనగరానికి ఆగ్నేయ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ డెవలప్ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు రెడీ అయింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టు, నగరానికి తూర్పు, ఆగ్నేయ దిశల్లో విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ (RRR) ద్వారా చక్కటి రవాణా సంబంధాలు కలిగిన ఈ ప్రాంతం.. భవిష్యత్తులో మెట్రో కనెక్టివిటీతోనూ సమృద్ధిగా అభివృద్ధి చెందనుంది. దీనికోసం ప్రత్యేకంగా భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (BFCDA)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లాలోని 56 గ్రామాలు, 7 మండలాలు భాగస్వామ్యం అవుతున్నాయి.
ఇబ్రహీంపట్నం (8 గ్రామాలు)
కడ్తాల్(6 గ్రామాలు)
యాచారం (17 గ్రామాలు)
కందుకూరు(18 గ్రామాలు)
ఆమనగల్ (2 గ్రామాలు)
మహేశ్వరం (2 గ్రామాలు)
మంచాల (3 గ్రామాలు)
ఈ ప్రాంతాలన్నీ ఇప్పటికే రహదారులు, నీటి సదుపాయాలు, విద్యుత్ వసతులు వంటి మౌలిక అవసరాల్లో మెరుగుదల చూడడం మొదలుపెట్టాయి. హైదరాబాద్ నగరం గత పదేళ్లలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాం గూడ వంటి ప్రాంతాలు ఐటీ హబ్‌లుగా మారడంతో ఆ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకినవి.
ఇప్పుడు అదే గమనాన్నిఈ ప్రాంతం అనుసరిస్తోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ ప్రాంతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంగా ఉండటంతో ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఎడ్యుకేషన్ హబ్‌లుగా అభివృద్ధి అయ్యే అవకాశం చాలా మెండుగా కనిపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

ప్రాప్‌షేర్ సెలెస్టియా REIT ఐపీఓ: నేడే చివరి అవకాశం!

Hyderabad: హైదరాబాద్‌లో డ్రైవర్ లేని పాడ్ టాక్సీలు! ఆ ఏరియా వాళ్లకు పండగే!

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

హైదరాబాద్ నీటి కష్టాలు: ఐటీ కారిడార్‌లో అద్దెలు ఆకాశానికి!

Bengaluru: ఇన్వెస్టర్లకు పండగే: బెంగళూరులోని ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ భారీగా జంప్!

బెంగళూరు అద్దెలు షాకింగ్: సామాన్యుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications