హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఏదో విషయంలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన వారు ఉద్యోగంలో సెటిల్ కాగానే ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ లో సొంతిల్లు ఉంటే చాలు ఎలాగైనా బతికేయవచ్చు అనే స్థాయికి ఉద్యోగులతో పాటు సామాన్యులు కూడా వచ్చేశారు.
ఈ నేపథ్మంలోనే తెలంగాణతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్థిరాస్థి రంగం ఊపందుకుంది. ఈ ఏడాదిలో మొదటి రెండు నెలల్లోనే రిజిస్ట్రేషన్ల శాఖ గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. 2024లో ఏప్రిల్, మే, జూన్ రెండు వారాల్లో మొత్తం 3.24 లక్షల రిజిస్ట్రేషన్లు జరగగా.. 2025లో 3.37 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంటే దాదాపు నాలుగు శాతం వృద్ధిని ఈ రంగం సాధించింది.
ఇక ఈ పరిస్థితులు ఇలా ఉంటే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌లో అపార్ట్‌మెంట్ల కార్పెట్ ఏరియా తగ్గి లోడింగ్ ఫాక్టర్ పెరుగుతోంది. నగరంలో అపార్ట్‌మెంట్లలో లోడింగ్ ఫాక్టర్ పెరుగుదల విపరీతంగా కనిపిస్తోందని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ ANAROCK నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే అపార్ట్‌మెంట్ల కార్పెట్ ప్రాంతం 62 శాతానికి తగ్గిందని చెబుతోంది. దీనికి కారణం ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని కోరుకోవడమే. గృహ ప్రాజెక్టులలో అత్యాధునిక సౌకర్యాలకు డిమాండ్ పెరుగుతున్నందున కార్పెట్ ఏరియా మీద ప్రజలు శ్రద్ధపెట్టడం లేదని నివేదిక ద్వారా తెలుస్తోంది.

కార్పెట్ ఏరియా అంటే ఏమిటి : ఓనర్ తనకున్న ఫ్లాట్ ఏరియాలో వినియోగించే స్థలం మొత్తాన్ని కార్పెట్ ఏరియాగా పిలుస్తారు. ఇందులో లిఫ్ట్, మెట్లు, క్లబ్‌హౌస్, పార్క్ ఇతరత్రా వసతుల కోసం కేటాయించిన స్థలం కూడా ఉంటుంది. దీన్ని మరో విధంగా సూపర్ బిల్టప్ ఏరియాగా కూడా వ్యవహరిస్తుంటారు. అయితే నగరంలో అత్యాధునిక సౌకర్యాలు, విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడిన వారు ఈ కార్పెట్ ఏరియాకు, సూపర్ బిల్టప్ ఏరియాకు పాధాన్యం ఇవ్వడం లేదు. ఈ స్థలంలోనే విలావవంతమైన సౌకర్యాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో లోడింగ్ ఫాక్టర్ పెరుగుదల కనిపిస్తోంది.
లోడింగ్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? నివాసయోగ్యమైన అపార్ట్‌మెంట్లలో సూపర్-బిల్ట్-అప్ ఏరియాతో పాటు కార్పెట్ ఏరియా మధ్య వ్యత్యాసాన్నే లోడింగ్ ఫ్యాక్టర్ గా పిలుస్తారు. నగరాల్లో విలాసవంతమైన జీవనాన్ని కోరుకుంటున్న వారు.. ఇప్పుడు అధిక వసతులు, సౌకర్యాలను తమ నివాసాల్లో కోరుకుంటున్నారు. దీంతో కార్పెట్ ఏరియా తగ్గిపోతోంది. తాజా నివేదిక ప్రకారం.. టాప్ ఏడు నగరాల్లో 2025 మొదటి త్రైమాసికంలో సగటు అపార్ట్‌మెంట్ లోడింగ్ ఫ్యాక్టర్ 40 శాతానికి చేరుకుందని ANAROCK నివేదిక తెలిపింది.
ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, కోలకతా వంటి నగరాల్లోని అపార్ట్‌మెంట్లలోని మొత్తం స్థలంలో 60 శాతం నివాసయోగ్యమైన స్థలంగా ఉంటే మిగిలిన 40 శాతం సాధారణ ప్రాంతంగా ఉంది. ఈ ఏరియాలోనే ఫిట్‌నెస్ కేంద్రాలు, క్లబ్ హౌస్, పార్క్, గార్డెన్, గ్రాండ్ లాబీలు ఉండాలని నివాస యజమానులు కోరుకుంటున్నారు. ఇక రియల్ ఎస్టేట్ డెవలపర్లు.. గృహ యజమానులకు అందించిన మొత్తం కార్పెట్ ప్రాంతాన్ని పేర్కొనాలని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కోరుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఏ చట్టం కూడా ప్రాజెక్టులలో లోడింగ్ కారకాన్ని పరిమితం చేయలేదు.
లోడింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా: లోడింగ్ శాతం = (సూపర్ బిల్ట్-అప్ ఏరియా - కార్పెట్ ఏరియా) ÷ కార్పెట్ ఏరియా × 100
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications