real estate news: హైదరాబాద్‌ను ఏలేందుకు రంగంలోకి ముంబై కంపెనీ.. రియాల్టీ రంగం ఇక పరుగులే
hyderabad realty: గత కొంతకాలంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కూడా భాగ్యనగరంలో తమ ఉనికిని చాటేందుకు తహతహలాడుతున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ కూడా తాజాగా హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది.
ముంబైకి చెందిన డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్.. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో భూమిని సొంతం చేసుకున్నట్లు తెలిపింది. నగరంలోని వ్యూహాత్మక స్థానంలో, అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతంలో 12.5 ఎకరాల ల్యాండ్ స్వాధీనంలోకి తీసుకున్నట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. దీన్ని భారీ స్థాయిలో డెవలప్ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

దాదాపు 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని విక్రయించదగిన ప్రాంతంగా తేలినట్లు కంపెనీ వివరించింది. ఇందులో ప్రధానంగా ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు ద్వారా సుమారు 3 వేల 500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఆధునిక సౌకర్యాలు మరియు డిజైన్‌తో హై క్వాలిటీ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు వెల్లడించింది. నాణ్యమైన లైఫ్ స్టైల్ అనుభవం కోసం ఎదురుచూస్తున్న గృహ కొనుగోలుదారుల ఆకాంక్షలను ఈ తీరుస్తామని ప్రకటించింది.
'దేశంలో అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లలో హైదరాబాద్ ఒకటి. నగరంలోకి మేము ప్రవేశిస్తున్నట్లు ప్రకటించినందుకు సంతోషిస్తున్నాము. దేశంలోని కీలక మార్కెట్లలో మా పోర్ట్‌ఫోలియోను ఈ కొనుగోలు బలపరుస్తుందని నమ్ముతున్నాం. నగరవాసులకు దీర్ఘకాలిక విలువను సృష్టించే ఒక కీలక ప్రాజెక్ట్‌ను అందించడానికి ప్రయత్నిస్తాము' అని గోద్రెజ్ ప్రాపర్టీస్ CEO గౌరవ్ పాండే తెలిపారు.


Click it and Unblock the Notifications