property registration charges in Karnataka: ఆస్తి రిజిస్ట్రేషన్లపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25, 2025-26 మొదటి త్రైమాసికంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యాలను చేరుకోలేకపోవడంతో సిద్ధరామయ్య సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వారాంతం నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజును 1 శాతం నుండి 2 శాతం రెట్టింపు చేసింది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వం అదనపు ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటివరకు కర్ణాటకలో ఏ ఆస్తి లావాదేవీకి మార్గదర్శక విలువపై 5% స్టాంప్ డ్యూటీ, 1% రిజిస్ట్రేషన్ ఫీజు, 0.5% సెస్, 0.1% సర్‌ఛార్జ్ వసూలు చేస్తుండగా మొత్తం 6.6 శాతం ఖర్చు అవుతుండేది. అయితే తాజా మార్పుతో రిజిస్ట్రేషన్ ఫీజు 2 శాతంకి పెరగడంతో మొత్తం రుసుము 7.6 శాతానికి చేరింది. ఇది ఆగస్టు 31, ఆదివారం నుండి అమల్లోకి రానుంది.

కర్ణాటకలో రిజిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్, స్టాంపుల కమిషనర్ (IGR&CS) ముల్లై ముహిలన్ ఎం.పి. మాట్లాడుతూ.. ఈ పెంపు ఉన్నప్పటికీ కర్ణాటకలో ఆస్తి లావాదేవీల రుసుము దక్షిణ భారతదేశంలోని పొరుగు రాష్ట్రాల కంటే ఇంకా తక్కువగానే ఉందని తెలిపారు. ఉదాహరణకు తమిళనాడులో మొత్తం రుసుము 11 శాతంగా ఉండగా.. కర్ణాటకలో అది 7.6 శాతం మాత్రమేనని వివరించారు.
ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్స్ (JDA), జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA)లకు కూడా రిజిస్ట్రేషన్ ఫీజును 1 శాతం నుండి 2శాతంకి పెంచారు. ఇవి సాధారణంగా పెద్ద స్థలాలు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాలు కావడంతో.. ఈ మార్పు రియాల్టీ రంగంపై గణనీయమైన ప్రభావం చూపనుంది.
2024-25లో శాఖకు 26 వేల కోట్లు ఆదాయ లక్ష్యం విధించగా.. వాస్తవ వసూళ్లు కేవలం రూ. 22,500 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాగే 2025-26 మొదటి త్రైమాసికంలో కూడా శాఖ నిర్దేశించిన రూ. 28 వేల కోట్ల లక్ష్యానికి 35శాతం తక్కువ వసూలు చేసింది. ఈ లోటును భర్తీ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే అనేక త్రైమాసికాలుగా మందగమనంలో ఉంది. ఇలాంటి సమయంలో ఫీజులను పెంచడం సరైన నిర్ణయం కాదని బిల్డర్లు విమర్శించారు. ముఖ్యంగా ఆస్తి లావాదేవీలకు తప్పనిసరి చేసిన ఇ-ఖాతా ఆదేశం కూడా లావాదేవీలను మందగింపజేసిందని వారు ఆరోపిస్తున్నారు. ఫీజు పెంపు వల్ల ఆదాయ సమస్యలు పరిష్కారం కావని, దీని వల్ల గృహ కొనుగోలుదారులపై మరింత భారమని బిల్డర్ల అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు సమీక్ష సమావేశంలో స్టాంప్ డ్యూటీని 1శాతం పెంచే ప్రతిపాదన ఉన్నప్పటికీ, చివరికి రిజిస్ట్రేషన్ ఫీజును 1శాతం పెంచే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 6శాతం కంటే తక్కువ స్టాంప్ డ్యూటీ విధిస్తున్న రాష్ట్రాలలో కర్ణాటక ఒకటిగా కొనసాగుతుంది.
ఈ నిర్ణయం కనుక అమల్లోకి వస్తే.. కర్ణాటకలో గృహాలు, భూములు కొనుగోలు చేసే వారిపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ముఖ్యంగా మధ్యతరగతి గృహ కొనుగోలుదారులు, రియాల్టీ రంగం కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం దీని ద్వారా భారీ ఆదాయాన్ని రాబట్టాలని ఆశిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications