Real estate news: 'ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు' అనే నానుడి తెలుగునాట సుపరిచితమే. అయితే ఇల్లు కొంటే ఇల్లాల్ని ఫ్రీగా ఇచ్చే పనికిమాలిన ఆఫర్‌తో ఓ సంస్థ మార్కెట్లోకి వచ్చింది. పెళ్లికాని ప్రసాదులకు గాలం వేసేందుకు ప్రయత్నించింది. ఊహించని విధంగా చివరికి చిక్కుల్లో పడింది.
భారతదేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వివిధ నగరాల నుంచే కాకుండా NRIల నుంచి కూడా భారీ డిమాండ్ ఏర్పడటంతో ఈ రంగంలో భారీ వృద్ధి నమోదవుతోంది. అయితే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కీర్తి గడించిన చైనాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

అక్కడ రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఏదో విధంగా సేల్స్ పెంచడానికి చైనీస్ ప్రాపర్టీ డెవలపర్‌లు సృజనాత్మకతను జోడించి వింత ఆఫర్స్ ఇస్తున్నారు. టియాంజిన్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ 'ఇల్లు కొనండి, ఫ్రీగా భార్యను పొందండి' అని ప్రకటన ఇచ్చినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. జెజియాంగ్ ప్రావిన్స్‌లోని మరో కంపెనీ గృహ కొనుగోలుదారులకు బంగారు కడ్డీలు ఇస్తామంటూ వాగ్దానం చేసింది.
ఫ్రీ భార్యల ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చైనీస్ రెగ్యులేటర్స్ రంగంలోకి దిగాయి. సదరు కంపెనీపై 4 వేల 184 డాలర్ల జరిమానా విధించాయి. దేశంలోని 4 సంపన్న నగరాల్లో ఇళ్ల ధరలు 11 నుంచి 14 శాతం మేర తగ్గాయి. విక్రయాలు సైతం 6 శాతం క్షీణించడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈ తరహా పిచ్చి ప్రకటనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications