బెంగళూరులో రెంటు పేరుతో ఓనర్ల దోపిడి.. స్టార్టప్ కంపెనీలకు గుడ్ బై చెబుతున్న యువ వ్యాపారవేత్తలు

భారతదేశంలోని టెక్ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో జీవించడం తలకు మించిన భారంలా మారింది. ఇప్పుడు అక్కడ జీవించడం, వ్యాపారం నడపడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. నివాస గృహాల అద్దెలు నింగికి ఎగబాకుతున్న వేళ.. ఆఫీస్ స్థలాల అద్దె మార్కెట్ కూడా అదే స్థాయిలో పెరిగి చిన్న స్టార్టప్‌లకు దాదాపు అసాధ్యంగా మారింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ఈ పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది.

ఫిన్‌టెక్ స్టార్టప్ డైమ్ వ్యవస్థాపకురాలు చంద్రలేఖ MR.. బెంగళూరులో ఆఫీస్ స్థలం అద్దెకు తీసుకోవాలనుకున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని LinkedIn లో పంచుకున్నారు. నెలకు రూ. 50 వేల అద్దె ఉన్న ఆఫీస్ కోసం, ఇంటి యజమాని 10 నెలల అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు అడిగాడు.. అంటే మొదటి సంవత్సరంలోనే రూ. 11 లక్షల భారం అంటూ రాసుకొచ్చింది. నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. అయినా కూడా ఈ మొత్తం అడ్వాన్స్ నమ్మశక్యం కాకుండా అనిపించిందని తెలిపారు.

Bengaluru office rent Bangalore commercial real estate office space deposit 10-month rent advance rent crisis startups in Bengaluru coworking spaces real estate news office rental trends commercial property market business rent hike landlords in Bengaluru office space demand startup ecosystem real estate inflation Bengaluru property rates small business challenges office leasing rental policy India business news Bengaluru rent problem commercial rent boom tech hub property urban office market real estate investment 10

ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ లేదా ముంబై వంటి ఇతర నగరాల్లో సాధారణంగా 2 నుంచి 6 నెలల డిపాజిట్ మాత్రమే అడుగుతారు. కానీ బెంగళూరులో ఈ నిబంధన దాటిపోయి, ల్యాండ్‌లార్డులు తమకు నచ్చినంత అడ్వాన్స్ కోరుతున్నారని తెలిపారు. చంద్రలేఖ వివరించినట్టుగా ఇది ఒకే సంఘటన కాదు. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఒక కెనడియన్ ప్రొఫెషనల్ నెలకు రూ. 2.3 లక్షలు అద్దె ఉన్న ఆఫీస్ కోసం అంతే మొత్తాన్ని రూ. 2.3 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాల్సి వచ్చింది. మరో స్టార్టప్ వ్యవస్థాపకుడిని నెలకు రూ. 40 వేల అద్దె ఉన్న స్థలానికి రూ. 5 లక్షల అడ్వాన్స్ ఇవ్వమని అడిగారు. ఈ పరిస్థితి స్టార్టప్‌లకు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిగా మారింది.

చంద్రలేఖ పోస్ట్‌లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఇంటి యజమానులు ఆఫీస్ ఖాళీ చేసే సమయంలో చిన్న మరకలు లేదా గీతలకు కూడా భారీ డిడక్షన్‌లు చేస్తున్నారు. అంటే, మీరు పూర్తిగా డిపాజిట్ తిరిగి పొందడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. ఇక రెడ్డిట్‌లో అయితే ఇలాంటి అనుభవాలతో నిండిన వందల కథలు ఉన్నాయి. అద్దెదారులు తమ డిపాజిట్‌లో పెద్ద భాగం కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు.

భారత అద్దె చట్టం ప్రకారం.. నివాస గృహాల కోసం గరిష్టంగా 2 నెలల డిపాజిట్ మాత్రమే వసూలు చేయాలి. వాణిజ్య ఆఫీసుల కోసం గరిష్టంగా 6 నెలల డిపాజిట్ మాత్రమే వసూలు చేయాలి. అయితే బెంగళూరులో ఈ చట్టం దాదాపు అమలు కావడం లేదు. ల్యాండ్‌లార్డులు దీన్ని సాధారణ పద్ధతిగా చూపిస్తూ, ఎక్కువ అడ్వాన్స్ వసూలు చేస్తున్నారు. ల్యాండ్‌లార్డుల మాటల్లో మనం చూసినట్లయితే ఇది ప్రాపర్టీ నష్టం, నమ్మదగని అద్దెదారుల నుంచి రక్షణ కోసం అని చెబుతున్నారు.అయితే అద్దెదారుల దృష్టిలో ఇది మాత్రం పూర్తిగా దోపిడీగా మారింది.

చంద్రలేఖ మాట్లాడుతూ.. ఆఫీస్‌లోకి వెళ్లకముందే ఇంత డబ్బు చెల్లించడం అంటే ఆస్తి డౌన్ పేమెంట్ చేసినట్లే అనిపిస్తోంది. అంటే, ఒక చిన్న స్టార్టప్‌ ప్రారంభ దశలోనే లక్షల రూపాయల ముందస్తు పెట్టుబడి పెట్టాలి. ఇది చాలా మందికి అసాధ్యమని చెప్పుకొచ్చారు. బెంగళూరులో ఇప్పుడు కేవలం ఆఫీస్ అద్దెలే కాదు. ఫ్లాట్ అద్దెలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ కారణంగా చాలా మంది ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు మైసూరు, హుబ్లీ, హోసూర్ వంటి సమీప నగరాలకు వలస వెళ్తున్నారు.

ఈ పరిస్థితి Bengaluru రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో దోపిడీ సంస్కృతి పెరుగుతోందనే సూచన. అద్దె చట్టం సక్రమంగా అమలు కాకపోతే, ఈ నగరంలోని కొత్త వ్యాపారాలు, స్టార్టప్‌లు, యువ ప్రొఫెషనల్‌లు మరింత కష్టాల్లో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+