Women: గతంలో సమాజం ద్వారా అణచివేతకు గురైన మహిళలు.. ప్రస్తుతం పురుషులకు ధీటుగా ఎదుగుతున్నారు. అన్ని రంగాల్లోనూ మగవారిని వెనక్కి నెట్టి ఔరా అనిపిస్తున్నారు. పెట్టుబడుల్లోనూ హవా చాటుతున్నారు. మహిళల ఇన్వెస్ట్ మెంట్ అనగానే బంగారంపై అని అనుకుంటే పొరపాటే అవుతుంది. తాజా సర్వే నివేదికలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. స్వర్ణం కనీసం టాప్ రెండు స్థానాల్లోనూ లేకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయమే.

పడిపోయిన బంగారం స్థానం:
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ ఒక సర్వే నిర్వహించింది. మొత్తం 5 వేల 5 వందల మంది ఇందులో పాల్గొనగా.. వారిలో 50 శాతం మహిళలే. పెట్టుబడుల విషయమై వారిని ప్రశ్నించగా.. 65 శాతం మంది రియల్ ఎస్టేట్‌లో, 20 శాతం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడైంది. బంగారంపై ఆసక్తి చూపే వారు కేవలం 8 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిసింది. మిగిలిన 7 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు మొగ్గుచూపిస్తున్నట్లు సర్వే పేర్కొంది.

దాదాపు అరకోటిపైనే ఆసక్తి:
రూ.45 లక్షలకు పైగా ఉన్న ఇళ్లపై 83 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తున్నట్లు మరో పరిశోధనలో తేలిందని అనరాక్ వెల్లడించింది. రూ.45-90 లక్షల శ్రేణిని 36 శాతం మంది మహిళలు 'స్వీట్ స్పాట్'గా చూస్తున్నారని, 27 శాతం రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఉన్న ప్రీమియం గృహాలను ఇష్టపడతున్నారంది. అయితే దాదాపు 20 శాతం మంది రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ గృహాల వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపింది. రూ.45 లక్షల లోపున్న సరసమైన గృహాలకు మాత్రం తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు స్పష్టం చేసింది.

స్పష్టమైన అవగాహనతో..
దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లో మహిళలు ఎదిగారని అనరాక్ గ్రూప్ వైస్ ఛైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. పట్టణ ముఖ్య కేంద్రాల్లో నివాసాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. భారీ గృహాలు, నిర్ధిష్ట బడ్జెట్ విషయంలో కొత్త ధోరణులను అనుసరిస్తున్నట్లు తేలిందన్నారు. వారికేమి కావాలో స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నట్లు చెప్పారు. గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం.. నివాస, పెట్టుబడి అవసరాల కోసం ఇళ్ల కొనుగోళ్ల మధ్య నిష్పత్తి 82:18గా ఉంది. అయితే ఇప్పుడు 77:23 నిష్పత్తితో భారీ వ్యత్యాసం గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది.

మహిళల యాజమాన్యంతో పలు ప్రయోజనాలు:
తమ పేర్లపై ఆస్తుల కొనుగోలు, రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా భారతీయ మహిళలు అనేక ప్రయోజనాలు పొందవచ్చని అనరాక్ పేర్కొంది. వివిధ ప్రభుత్వ పథకాలు సైతం మహిళల ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. 2015లో కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద గృహాలను పొందాలంటే.. అవి తప్పనిసరిగా మహిళల పేరుతో లేదా వారు సహ యజమానిగా ఉండాల్సిందేనని గుర్తుచేశారు. పలు రాష్ట్రాల్లో తక్కువ స్టాంప్ డ్యూటీ, గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు ప్రయోజనం సైతం పొందవచ్చన్నారు. పన్ను మినహాయింపుల్లోనూ పలు అవకాశాలున్నట్లు చెప్పారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications