రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం చోటు చేసుకుంది. ఒక్క వారంలోనే లగ్జరీ ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. ఫ్లాట్ విలువతో సంబంధం లేకుండా ఎగబడి కొనేశారు గృహ యజమానులు. ఇదిఎక్కడో కాదు గురుగ్రామ్ లో. వివరాల్లోకెళితే.. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ లిమిటెడ్ గురుగ్రామ్ లో.. తన సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ వెంచర్ ప్రివానా నార్త్‌లోని ఫ్లాట్లన్నీ కేవలం ఏడు రోజుల్లోనే పూర్తిగా అమ్మకాలు జరిపినట్లుగా తెలిపింది.
గురుగ్రామ్‌లోని 116 ఎకరాల విశాలమైన టౌన్‌షిప్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్.. దేశంలోని పెద్ద నగరాల్లో ప్రీమియం గృహాల కోసం ఉన్న బలమైన మార్కెట్ ని హైలైట్ చేసింది. దాదాపు రూ.11,000 కోట్లకు పైగా అమ్మకాలను డీఎల్ఎఫ్ లిమిటెడ్ నమోదు చేసింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 76, సెక్టార్ 77లలో 17.7 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రివానా నార్త్ లో ఆరు ఎత్తైన 50 అంతస్తుల నిర్మాణాలను డీఎల్ఎఫ్ లిమిటెడ్ చేపట్టింది. వీటిని DLF ఇప్పటివరకు అభివృద్ధి చేసిన అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్లు ఇవేనని చెప్పుకోవచ్చు.

ఈ రెసిడెన్సియల్ ప్రాజెక్టులో 1,152 నాలుగు బెడ్‌రూమ్‌ల గదులతో పాటు ఒక డజను పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. ప్రివానా నార్త్‌లో ఒక్కో ఫ్లాట్ ధర రూ.9.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంది.విశాలమైన నివాస స్థలాలు, ఆకట్టుకునే నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో DLF ఈ గృహ నిర్మాణాలను చేపట్టినట్లు DLF హోమ్ డెవలపర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి తెలిపారు.
ఇక్కడ నిర్మించిన ఫ్లాట్లలో మాస్టర్ బెడ్‌రూమ్‌లు మునుపటి DLF నిర్మాణాల కంటే దాదాపు 33% పెద్దవి. అలాగే ప్రతి యూనిట్ మూడు ప్రత్యేక పార్కింగ్ స్లాట్‌లతో వస్తుంది.పైన నాలుగు పెంట్‌హౌస్‌లు వస్తాయి. లేఅవుట్‌లలో విశాలమైన లివింగ్ ఏరియాలు, లైఫ్‌స్టైల్ కిచెన్‌లు, ఫోయర్‌తో పాటుగా 500 మీటర్ల వెడల్పు గల రిజర్వ్డ్ గ్రీన్ జోన్ కూడా ఉంది. కాగా హై-ఎండ్ నివాసాలకు ఉన్న డిమాండ్, డీఎల్ఎఫ్ నివాస ప్రాజెక్టులపై కొనుగోలుదారులకు ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రతిస్పందనకు కారణమని కంపెనీ చెబుతోంది. పైగా SPR, NH-48, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానించబడిన ఈ టౌన్‌షిప్, DLF కార్పొరేట్ గ్రీన్స్, TCS, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్యాంపస్‌లకు సమీపంలో ఉండటం వల్ల కొనుగోలుదారులు ఎగబడ్డారు.
ఇక CBRE ప్రకారం.. 2025 మొదటి త్రైమాసికంలో రూ.4 కోట్ల కంటే ఎక్కువ ధర గల ఇళ్ల అమ్మకాలు 28% పెరిగాయి, ఇందులో ఢిల్లీ-NCR సింహభాగం వాటాను కలిగి ఉంది.2025 ఆర్థిక సంవత్సరంలో డీఎల్ఎఫ్ రికార్డు స్థాయిలో రూ.21,223 కోట్ల ప్రీ సేల్స్ సాధించింది. ఇది గత సంవత్సరం కంటే 44% ఎక్కువ.భవిష్యత్తులో గురుగ్రామ్, ముంబై, గోవాలలో లాంచ్ చేసే ప్రాజెక్టులకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications