మీరు ఇల్లు కొనబోతున్నారా? లేక కొన్నారా.. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు. అసలు ఆస్తిపై పూర్తిగా హక్కు ఉందా లేదా అనేది కూడా చూడాలి. లేకుంటే మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా డబ్బులు బొక్క తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ మధ్య ఇదే విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇప్పటివరకు చాలా మంది ప్రాపర్టీ కొనుగోలు దారుల భావన ఏంటంటే.. ఒక ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేస్తే, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలు, అది పూర్తిగా తమదే అనే నమ్మకం. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈ నమ్మకాన్ని తుప్పుపట్టిన నాణెంలా తేల్చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, రిజిస్ట్రేషన్ అనేది కేవలం లావాదేవీ జరిగిన విషయాన్ని నమోదు చేసిన ఆధారం మాత్రమే. అదే యాజమాన్య హక్కును నిర్ధారించదు. అంటే, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక కూడా ఆ ప్రాపర్టీ మీద పూర్తిగా మీ హక్కు ఉందని గ్యారంటీ లేదని తేల్చి చెప్పింది. దీనికి ఉదాహరణగా భావన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కేసును పరిగణలోకి తీసుకుంది.

1982లో భావన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనే సంస్థ 53 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ భూమిని ఇతరులకు విక్రయించింది. విక్రయించిన వారి వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు విచారణలో ఆ భూమి నిజంగా ఆ సొసైటీదేనా అనే విషయం మీదే సందేహం వ్యక్తమైంది.దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరిస్తూ.. రిజిస్ట్రేషన్ ఉన్నా సరే, అది యాజమాన్యాన్ని నిర్ధారించదు. అసలు ఆ భూమిపై పూర్తిగా హక్కు ఉందా అనే విషయమే ముందుగా చూడాలని తెలిపింది. ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయబడినదంత మాత్రాన, అది ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు కలిగించదని ధర్మాసనం తీర్పులో తెలిపింది.
కాబట్టి ఇల్లు కొనుగోలుదారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..
ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ ఉందా లేదా ముందుగా చెక్ చేయండి. భూమి కొనబోయే ముందు లీగల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలి. లీగల్ నిపుణుడిని తీసుకొని అన్ని డాక్యుమెంట్లు పరిశీలించించండి. ప్రాపర్టీ పై ఏమైనా వివాదాలు లేదా పాత కేసులు ఉన్నాయా అని తెలుసుకోండి. దీనిపై మీరు లోన్ తీసుకుంటే, బ్యాంకు కూడా లీగల్ వెరిఫికేషన్ చేస్తుంది. లింక్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్, EC, టాక్స్ రసీదులు, రేరా సర్టిఫికేట్ లాంటి ముఖ్యమైన పత్రాలను న్యాయవాదితో ధృవీకరించుకోండి.
చెక్ చేయవలిసిన డాక్యుమెంట్లు
సేల్ డీడ్ (Sale Deed): అసలైన యజమాని నుండి ఆస్తి కొనుగోలు చేసినట్టు పేర్కొనాల్సిన డాక్యుమెంట్.
టైటిల్ డీడ్ (Title Deed): ఆస్తిపై హక్కును నిర్ధారించే ముఖ్యమైన ఆధారం.
పట్టా / ఖాతా పుస్తకం: భూమిపై హక్కుల ఆధారంగా ప్రభుత్వం మంజూరు చేసిన డాక్యుమెంట్లు.
ఇంకంబరెన్స్ సర్టిఫికేట్ (EC) (లోన్లు, తనఖాలో ఏమైనా ఉందా అని తెలియజేసే పత్రం. దీన్ని మీరు ఆన్‌లైన్‌లో లేదా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు
పజెషన్ లెటర్ / అలాట్‌మెంట్ లెటర్
ప్రాపర్టీ టాక్స్ రసీదులు : యజమాని తాను ఆస్తికి సంబంధించి పన్నులు చెల్లిస్తున్నాడని నిరూపణ.
విల్లు ద్వారా లభించిన ఆస్తి అయితే - రిజిస్టర్డ్ విల్
RERA రిజిస్ట్రేషన్ (నివాస ప్రాజెక్టుల కోసం): ఆ ప్రాజెక్టు లీగల్‌గా ఆమోదించబడిందని నిర్ధారించుకోవడం.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications