భారత ఎగుమతులపై అమెరికా ప్రకటించిన 50 శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన FICCI-IBA వార్షిక బ్యాంకింగ్ సమావేశంలో Sanjay Malhotra మాట్లాడుతూ.. ట్రంప్ సుంకాలతో భారత ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉన్నప్పటికీ, అవసరమైతే కేంద్ర బ్యాంకు ముందుకు వచ్చి వృద్ధికి, ప్రభావిత రంగాలకు మద్దతు ఇచ్చే చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ముఖ్యంగా ప్రభావిత రంగాలకు మద్దతు ఇవ్వడానికి RBI ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అవసరమైతే మేము వెనుకడుగు వేయమని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత ద్రవ్యత (liquidity) అందుబాటులో ఉందని.. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు బ్యాంక్‌లు, కార్పొరేట్లు కలసి రావాలని ఆర్బీఐ గవర్నర్ పిలుపునిచ్చారు. త్వరలోనే బాసెల్-3 నిబంధనలను అమల్లోకి తెస్తామని గవర్నర్ తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయడం, చిన్న వ్యాపారులకూ రుణ సాయాన్ని మరింతగా దగ్గర చేయడం, కస్టమర్ సేవల నాణ్యతను ఇంకా పెంచడం తమ ప్రాధాన్యతలని సంజయ్ మల్హోత్రా అన్నారు.

45 శాతం ఎగుమతులు టారిఫ్ పరిధికి బయట ఉన్నాయి. మిగిలిన 55 శాతంవస్తువులు మాత్రమే అమెరికా సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొంటాయని తెలిపారు. ఇందులో రత్నాలు-ఆభరణాలు, వస్త్రాలు, దుస్తులు, తోలు ఉత్పత్తులు, MSMEలు ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటాయని మల్హోత్రా హెచ్చరించారు. ముఖ్యంగా కార్మిక ఆధారిత పరిశ్రమలు అయిన వస్త్రాలు, పాదరక్షల రంగం దెబ్బతినే అవకాశం ఉందని భారత ప్రభుత్వం కూడా అంచనా వేసింది. ఇప్పటికే ఈ రంగాల ప్రతినిధులు, ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్‌లతో చర్చలు జరిపినట్లు సంజయ్ తెలిపారు.
RBI డేటా ప్రకారం చూసుకున్నట్లయితే.. సంవత్సరానికి పరిశ్రమలకు ఇచ్చిన రుణాల వృద్ధి 5.49 శాతం మాత్రమే. ఇది మార్చి 2022 తర్వాత కనిష్ఠ స్థాయిగా ఉంది. ఇది ప్రైవేట్ పెట్టుబడుల మందగమనం, కంపెనీలు కొత్త పెట్టుబడి నిర్ణయాలు వాయిదా వేయడం వంటి అంశాలకు ప్రతిబింబంగా భావించబడుతోంది.ఈ నేపథ్యంలో పరిశ్రమలు ధైర్యంగా పెట్టుబడులు పెట్టాలని మల్హోత్రా పిలుపునిచ్చారు. బ్యాంకులు, కార్పొరేట్లు చరిత్రలో అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు, కలిసి వచ్చి కొత్త పెట్టుబడి చక్రాన్ని సృష్టించాలి. దేశాన్ని నిర్వచించే వ్యవస్థాపక స్ఫూర్తి (entrepreneurial spirit) ఈ సమయంలో మరింత అవసరమని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై అదనంగా 25 శాతం సుంకం ప్రకటించిన సంగతి విదితమే. దీనితో మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో అధిక సుంకాల ప్రభావం భారత జిడిపి వృద్ధిపై 0.6% పాయింట్లు తగ్గించే ప్రమాదం ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు RBI ఇప్పటికే రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో పాటుగా బ్యాంకులకు తగినంత ద్రవ్యతను అందించి, ప్రభావిత రంగాలకు రుణప్రవాహం కొనసాగించేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం కూడా వరుస సంస్కరణల ద్వారా ఎగుమతిదారులకు మద్దతు అందిస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications