న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన రాజకీయ నాయకులు స్పందించారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో నిర్మలమ్మ జీడీపీ వృద్ధి పైనే దృష్టి సారించారు. తన బడ్జెట్ స్పీచ్‌లో దేశంలో మౌలిక సదుపాయాల రంగానికి అగ్రతాంబూలం వేశారు. పారిశ్రామిక, మార్కెట్ వర్గాల ఆశలు మాత్రం నెరవేరలేదు. గ్రామీణ భారతానికి, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ఈ బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే...

ఉద్యోగాలు, ఉపాధి పెరుగుతుంది
ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు ఈ బడ్జెట్ పెద్ద పీట వేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారన్నారు. బడ్జెట్‌లోని వివిధ స్కీంలు ఉద్యోగాలను పెంచేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ బడ్జెట్ స్కిల్ డెవలప్‌మెంట్ పైన కూడా దృష్టి సారించిందని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మద్దతుగా ఉందని, భారత్ ఎగుమతి కేంద్రంగా మరింతగా ఎదిగేందుకు ఈ బడ్జెట్లో చర్యలు తీసుకున్నారన్నారు.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఊతం
2024-25 ఆర్థిక సంవత్సరానికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి అనుకూలంగా ఈ బడ్జెట్ వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైనదిగా ఉందని అమిత్ షా అన్నారు. బ్యాంకుల బలోపేతానికి మౌళిక సదుపాయాల కల్పనకు నడ ప్రభుత్వం అద్భుతమైన బడ్జెట్ రూపొందించిందన్నారు. పన్ను వ్యవస్థను హేతుబద్దీకరించడానికి, మౌళిక సదుపాయాల రంగానికి, బ్యాంకుల బలోపేతానికి, పెట్టుబడుల ప్రోత్సాహానికి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఇలా ఎన్నో ఉన్నాయన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఊతమిస్తుందన్నారు.

మోడీ కలను దగ్గర చేసేదిలా..
ఈ బడ్జెట్ సరికొత్త ఇండియాను నిర్మించగలదనే నమ్మకాన్ని ఇస్తోందని, రాబోయే సంవత్సరాల్లో ఆరోగ్యపరంగా, సంపదను కలిగి ఉండేలా చేస్తుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అన్ని రంగాల అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించిన బడ్జెట్ అన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న మోడీ కలను దగ్గర చేసేలా ఉందన్నారు.

సుదీర్ఘ ప్రసంగం.. కానీ భయంకరం
నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదని రాహుల్ గాంధీ అన్నారు. అలాగే యువతకు ఉద్యోగ కల్పనకు సంబంధించి వ్యూహాత్మక ఆలోచనలు కనిపించలేదన్నారు. బడ్జెట్ ఆశించదగినదిగా లేదన్నారు. చరిత్రలో ఇది సుదీర్ఘమైన ప్రసంగం కావొచ్చునని కానీ భయంకరంగా ఉందన్నారు.

నిరాశకు గురి చేసింది
ఈ బడ్జెట్ పైన ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ సవతి తల్లి ప్రేమ చూపించారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ బడ్జెట్ నిరాశకు గురి చేసిందన్నారు.

బడ్జెట్ అద్భుతం
అభివృద్ధి ధ్యేయంగా ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని, అద్భుతంగా ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉద్యోగాల సృష్టికి ఊతమివ్వడంతో పాటు రైతుల సంక్షేమానికి అనుగుణంగా ఉందన్నారు.

బడ్జెట్ చూసి షాకయ్యా
కేంద్ర బడ్జెట్‌ను చూసి తాను షాకయ్యానని, వారసత్వంగా వస్తున్న ప్రభుత్వ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఎలా దాడి చేస్తుందో చూశారా అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.

చాలా పెద్దగా ఉంది.. గ్రహించలేకపోయా
ఇది చాలా పెద్ద బడ్జెట్ అని, దీనిని నేను గ్రహించలేకపోయానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ నిరాశపరిచిందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ బడ్జెట్‌కు తాను 1 నుంచి సున్నా మధ్య రేటింగ్ ఇస్తానని చిదంబరం అన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications