ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్‌ను దేశంలో ఉత్పత్తి చేయడానికి అవసరమైన భాగస్వామ్య ప్రక్రియ ముగిసింది. ఇక భారత్‌లోనే స్పుత్నిక్ వీ, స్పుత్నిక్ లైట్ (Sputnik Light) వ్యాక్సిన్లు తయారు కానున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లను భారత్‌లోనే తయారు చేయడానికి అనుమతులను కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

వొఖార్డ్‌తో కాంట్రాక్ట్..
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్.. స్పుత్నిక్ వీ అండ్ స్పుత్నిక్ లైట్. ఇందులో ఎన్సో హెల్త్‌కేర్ డీఎంసీసీ అండ్ హ్యూమన్ వ్యాక్సిన్ ఎల్ఎల్‌సీ కంపెనీ ఆర్డీఎఫ్ఐ సబ్సిడయిరీగా వ్యవహరిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఫార్ములాను దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో- ఆ ఫార్ములాను దిగుమతి చేసుకుని.. భారత్‌లో దాన్ని తయారు చేసే కాంట్రాక్ట్‌ను దేశీయ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ వొఖార్డ్ (Wockhardt) సాధించింది. వొఖార్డ్-ఆర్డీఎఫ్ఐ మధ్య ఓ భాగస్వామ్యం కుదింది.

70 శాతం మేర ఎగుమతికే..
ఈ మేరకు వొఖార్డ్ ఫార్మా కంపెనీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై భారత్‌లో స్పుత్నిక్ వీ, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ల తయారీ.. పంపిణీ ప్రక్రియను తాము పర్యవేక్షిస్తామని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద సరఫరా అయ్యే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌లో 65 నుంచి 70 శాతం మేర భారత్‌లోనే తయారయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తయారు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ధరను కూడా నిర్ధారించింది. ఒక్కో డోసు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ధరను రూ. 995.40 పైసలుగా నిర్ధారించింది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. ఇప్పుడు మళ్లీ వొఖార్డ్ తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

650 మిలియన్ డోసులు..
ఆర్డీఎఫ్ఐతో కుదిరిన ఈ కాంట్రాక్ట్ ప్రకారం.. జూన్ 2023 నాటికి వొఖార్డ్ కంపెనీ 620 మిలియన్ డోసుల స్పుత్నిక్ వీ, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది..దాన్ని సరఫరా చేయాల్సీ ఉంటుంది. తొలిదశలో వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ నాటికి 70 నుంచి 120 మిలియన్ డోసులను తయారు చేసేలా ఈ రెండు కంపెనీల మధ్య కాంట్రాక్ట్ కుదిరింది. మలిదశలో మరో 500 మిలియన్ డోసుల స్పుత్నిక్ వీ, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్లను జూన్ 2023 నాటికి ఉత్పత్తి, సరఫరాను ప్రక్రియను పూర్తి చేయాలి.

టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్..
ఈ కాంట్రాక్ట్ ఒప్పందాలపై ఆర్డీఎఫ్ఐ తరఫున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఎన్సో హెల్త్‌కేర్ సంతకాలు చేసింది. ప్రస్తుతం స్సుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, ఫార్ములా మొత్తం ఎన్సో హెల్త్‌కేర్ ఆధీనంలో ఉంటోంది. తాజాగా కుదిరిన ఒప్పందాల ప్రకారం.. ఆ కంపెనీ తన వ్యాక్సిన్ టెక్నాలజీని వొఖార్డ్‌కు బదలాయిస్తుంది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి ఆర్డీఐఎఫ్ ఇదివరకే గ్లాండ్ ఫార్మా, హెటెరో బయో ఫార్మా, ఫానాసియా బయోటెక్, స్టెలిస్ బయో ఫార్మా, విర్ఛోవ్ బయోటెక్, మోరెపెన్ ల్యాబొరేటరీస్‌లతో కాంట్రాక్ట్‌ను కుదుర్చుకుంది.

డెల్టా వేరియంట్లపైనా..
కాగా.. కరోనా వైరస్ సరికొత్త రూపం డెల్టా వేరియంట్‌పై స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 83 శాతం ప్రభావం చూపుతోందని రష్యా ఆరోగ్య శాఖా మంత్రి మిఖాయిల్ మురష్కో తెలిపారు. డెల్టా వేరియంట్ రకానికి చెందిన కరోనా వైరస్‌పై ఈ వ్యాక్సిన్ ఎఫీషియన్సీ 83 శాతంగా ఉంటోందని ప్రకటించారు. ఇదివరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా వెలువడిన ఫలితాలు గానీ, క్లినికల్ డేటా గానీ.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తోన్నాయని అన్నారు. కాగా- దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగం పరిమితంగా ఉంటోంది. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఇది అందుబాటులో ఉంటోంది.

జోరుగా వ్యాక్సినేషన్..
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. 52 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లను తీసుకున్నారు. ఇందులో మెజారిటీ సంఖ్యలో సింగిల్ డోసును వేసుకున్నారు. మూడు నెలల పాటు వ్యవధి ఉన్నందున రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య తక్కువే. కాగా- వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆరంభమైన తొలి రోజుల్లో టీకాల కొరత వేధించింది. చాలా రోజుల పాటు వ్యాక్సిన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. తన ఆధీనంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏ రాష్ట్రానికి అవసరమైన డిమాండ్ మేరకు ఆ రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

వాటి వాటా అధికం..
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, మన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ల వినియోగం అధికంగా ఉంటోంది. ఇందులో కూడా కోవిషీల్డ్‌దే టాప్ ప్లేస్. ప్రస్తుతం ఈ రెండు వ్యాక్సిన్ల కాక్‌టెయిల్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో..వాటిని మిళితం చేసే కార్యక్రమాన్ని నిపుణులు చేపట్టారు. తమిళనాడులోని వేలూరులో కాక్‌టెయిల్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్లను మిక్స్ చేసి తీసుకోవడం వల్ల అది మరింత ప్రభావాన్ని చూపుతుందని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications