రూ. 17 వేల కోట్లకు అమ్మకానికి ఆర్సీబీ.. షాక్‌లోకి వెళ్లిన ఫ్యాన్స్, కొత్త బాస్ ఎవరో..

18 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తొలి టైటిల్ ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాజాగా మార్కెట్లో అమ్మకానికి వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన కొద్ది రోజులకే ఆర్సీబీ మార్కెట్లో అమ్మకానికి రెడీగా ఉందనే వార్తలు క్రీడా రంగంతో పాటు వ్యాపార రంగంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఫ్రాంఛైజీ ప్రస్తుత యజమాని బ్రిటిష్ కంపెనీ డియాజియో పిఎల్‌సి ఐపిఎల్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) లో తన వాటాలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

కాగా డియాజియో తన భారతీయ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ద్వారా RCB యాజమాన్యపు హక్కులను కలిగి ఉంది. RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జట్టును వ్యాపారవేత్త విజయ్ మాల్యా కొనుగోలు చేశాడు. అయితే అతని విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అప్పులు చెల్లించలేకపోవడంతో 2012లో మూసివేశారు. తరువాత డియాజియో.. విజయ్ మాల్యా మద్యం వ్యాపారాన్ని కొనుగోలు చేయడం ద్వారా RCBని తన చేతుల్లోకి తీసుకుంది.

Royal Challengers Bengaluru RCB for sale RCB for sale Diageo selling RCB IPL 2025 champions Royal Challengers Bengaluru RCB team value IPL team valuation 2025 RCB ownership change Diageo exits IPL IPL franchise for sale RCB Rs 17000 crore RCB brand value IPL business news IPL 2025 IPL IPL IPL IPL 17000

భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ IPLలో పొగాకు, ఆల్కహాల్ బ్రాండ్ల ప్రకటనలను నిషేధించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ డీల్ చర్చలు జరుగుతున్నాయి.క్రీడా ప్రముఖులు ఇతర అనారోగ్యకరమైన ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేయకుండా నిరోధించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఇక భారతదేశంలో పొగాకు, ఆల్కహాల్ ఉత్పత్తుల ప్రత్యక్ష ప్రకటనలకు అనుమతి లేదు. ఈ పరిస్థితుల మధ్య డియాజియో వంటి కంపెనీలు తమ ప్రధాన బ్రాండ్‌ను పరోక్షంగా ప్రోత్సహించడానికి ప్రసిద్ధ క్రికెటర్లను ఉపయోగించుకున్నాయి.అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ కంపెనీ పునరాలోచనలో పడింది. ఎందుకంటే డియాజియో ప్రధాన వ్యాపారం మద్యం కావడంతో కేంద్రం ప్రవేశపెడుతున్న ఈ నియంత్రణలు వారి వ్యాపారానికి అడ్డంకిగా మారనున్నాయి.

దీంతో కంపెనీ ఆర్సీబీని అమ్మకానికి పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 16,834 కోట్లు) వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2205 గెలవడం ద్వారా ఆర్సీబీ విలువ అమాంతం పెరిగింది. ఇటువంటి సమయంలోనే దాన్ని క్యాష్ చేసుకోవాలని డియోజియో వ్యూహం రచిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రాంచైజీని విక్రయించడం ద్వారా భారీ లాభాలను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఆర్‌సిబి అమ్మకానికి అవకాశం ఉందనే వార్తలు గుప్పుమనడంతో యునైటెడ్ స్పిరిట్స్ షేర్ల ధరలు పెరిగాయి. మంగళవారం ఉదయం స్టాక్ ధరలు 3.3% వరకు పెరిగాయి. అయితే ఫ్రాంచైజీని విక్రయించాలా వద్దా అనే దానిపై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకులేద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి డియాజియో ప్రతినిధి నిరాకరించారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+