Freebies: ఎన్నికల్లో అధికారమే పరమావధిగా రాజకీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా హామీలు కుమ్మరిస్తున్నాయి. ఉచితాల పేరిట ఓ పక్క ప్రజలను సోమరులను చేస్తూ, మరోపక్క ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అప్పులు చేసి ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయి. వీటిపై RBI ఓ అధ్యయనం జరిపింది.
దేశంలోని ఆయా రాష్ట్రాల 2023-24 వార్షిక బడ్జెట్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసింది. 5 చార్టర్ల ద్వారా దీన్ని స్టడీ చేసిన ఆర్థికవేత్తలు పలు విషయాలపై ఆందోళన చెందుతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలకు చట్టపరమైన నిర్వచనం లేకపోవడం, రాజకీయ పార్టీలు తమ వాగ్ధానాల అమలుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

RBI డేటా ప్రకారం.. 2022-23లో ఛత్తీస్‌గఢ్ మరియు తమిళనాడు రాయితీల కోసం తమ రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(SDP)లో 5 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి. అనంతరం పంజాబ్, మధ్యప్రదేశ్ మరియు బీహార్ లు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర రాయితీల బిల్లు 2019-20లో 28 వేల 386 కోట్లు కాగా.. ఆ తర్వాత నుంచి డేటా అందించలేదు.
ఆయా రాష్ట్రాలు ప్రజల జీవితాలను మెరుగుపరచేందుకు మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యత ఇస్తాయి. వీటిలో వైద్యం మరియు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి వివిధ విభాగాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల సగటుతో పోలిస్తే 2023-24లో దేశ రాజధాని ఢిల్లీ తన SDPలో 5 వంతు కంటే ఎక్కువ వీటిపై ఖర్చు చేసింది. అయితే ఇప్పుటికీ పలు రాష్ట్రాలు ఈ విభాగంలో చాలా వెనకబడి ఉన్నాయి.
మానవాభివృద్ధిలో కీలకభాగమైన విద్యారంగంలో ఢిల్లీ ముందంజలో ఉంది. 2023-24లో 21 శాతం ఎడ్యుకేషన్ కోసం వెచ్చిస్తోంది. అన్ని రాష్ట్రాల సగటు 13.3 శాతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. చత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అస్సాంలు 16-18 శాతం పరిధితో కొనసాగుతున్నాయి.
వడ్డీ చెల్లింపులు, జీతాలు కోసం ఈశాన్య రాష్ట్రం మిజోరాం అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ఆదాయ రశీదుల్లో 95 శాతాన్ని వీటికోసం వెచ్చిస్తోంది. కొన్ని రాష్ట్రాలు GSDPలో 4 శాతానికి మించిన లోటుతో బడ్జెట్ కేటాయింపులు జరిపాయి. ఇది దేశ సగటు 3.1 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు RBI గుర్తించింది. ఆచరణ సాధ్యంకాని సబ్సిడీలు, ఉచిత హామీలు ఈ తరహా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తాయని హెచ్చరించింది.
More From GoodReturns

GR RBI MPC Poll: ఏప్రిల్లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications