RBI Alert: అక్రమ ఫారెక్స్ ట్రేడింగ్‌పై ఆర్‌బీఐ సీరియస్.. 75 సంస్థలపై కొరఢా..!
Foriegn Exchange Apps: దేశంలోని చట్టవిరుద్ధమైన ఫారెక్స్ ట్రేడింగ్ నిరోధించేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అనేక సంస్థల జాబితాను విడుదల చేసింది.
ఈ అక్రమ ఫారెక్స్ ట్రేడింగ్ కార్యక్రమాలకు బ్యాంకింగ్ ఛానెళ్లను దుర్వినియోగం కాకుండా ఉండేలా కఠినమైన చర్యల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం, బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. దీనిపై సలహాలు సూచనలు కోరుతూ గత నెలలో లేఖ రాసింది. ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాలని వారిని కోరింది.

ఈ ఏడాది ప్రారంభంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇద్దరు వ్యాపారులను అక్రమ కార్యకలాపాలకు సంబంధించి అరెస్టు చేసింది. అలాగే ఇప్పటి వరకు 75 సంస్థల జాబితాను అలర్ట్ జాబితాలో చేర్చింది. కోల్‌కతాకు చెందిన నిందితులు 180 బ్యాంకు ఖాతాలను నియంత్రించి, నిర్వహించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో రూ.120 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యాప్‌లతో సహా అనధికారిక ప్లాట్‌ఫారమ్‌లలో ఫారెక్స్ లావాదేవీలు చేసే ఖాతాదారులపై బ్యాంకుల ద్వారా చాలా ఎక్కువ పరిశీలన ఉంటుందని ఒక అధికారి వెల్లడించారు.
ఈ క్రమంలో ఫారెక్స్ లావాదేవీలు చేపట్టేందుకు అధికారం లేని ప్లాట్‌ఫారమ్‌లు, వెబ్‌సైట్‌లను కలిగి ఉన్న 75 సంస్థల జాబితాను రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. సెంట్రల్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్- 1999(FEMA) ప్రకారం ఫారెక్స్‌లో డీల్ చేయడానికి అధికారం లేని 34 ఎంటిటీల ప్రారంభ జాబితాను విడుదల చేసింది. వీటిలో కొన్నింటి జాబితాను పరిశీలిస్తే.. Alpari, AnyFX, Ava Trade, Binomo eToro, Exness, Expert Option, FBS, FinFxPro, Forex.com, Forex4money, Foxroex ఉన్నాయి. అనధికారిక సంస్థల ద్వారా ప్రయోజనాల కోసం ఫారెక్స్ లావాదేవీలను చేపట్టే నివాసితులు ఫెమా కింద చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించింది.


Click it and Unblock the Notifications