భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన స్వల్పకాలిక ప్రమాదాలపై భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, అమెరికా స్టాక్ మార్కెట్లలో కనిపిస్తున్న సంక్షోభం, కరెన్సీ మారకపు రేట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు, అంతర్గత ఆర్థిక పరిస్థితుల ప్రభావం భారత మార్కెట్లపై పడే అవకాశం ఉందని RBI స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని అవకాశం ఉందని తెలిపింది. అమ్మకాలు జరపడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు కొంత మేర నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఈ హెచ్చరికలన్నీ ఉన్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ, దాని ఆర్థిక రంగం ఏవైనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు బలంగా, సన్నద్ధంగా ఉన్నాయని RBI స్పష్టంచేసింది. కేంద్ర బ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (Financial Stability Report - FSR) లో ఈ అంశాలను వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన ప్రమాదాలు ప్రస్తుతం అధికంగా ఉన్నాయని, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని బలాలు, బలహీనతలను ఒకేసారి బయటపెడుతున్నాయని నివేదిక పేర్కొంది.

ప్రపంచ స్థాయిలో అనిశ్చితులు పెరుగుతున్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం బలమైన వృద్ధి దిశలో కొనసాగుతోందని RBI అభిప్రాయపడింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గడం, ఆర్థిక లోటును నియంత్రించాలనే ప్రభుత్వ నిబద్ధత, వివేకవంతమైన స్థూల ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలపరుస్తున్నాయని నివేదిక వివరించింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్థిక నిర్మాణంలో మార్పులు వంటి బాహ్య అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాళ్లుగా మారవచ్చు. ఇవి కరెన్సీ మారకపు రేట్లలో అధిక అస్థిరతకు, అంతర్జాతీయ వాణిజ్యం బలహీనపడటానికి, కార్పొరేట్ లాభాలు తగ్గడానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) తగ్గడానికి దారితీయవచ్చని RBI హెచ్చరించింది.
అమెరికా స్టాక్ మార్కెట్‌లో అకస్మాత్తుగా పెద్ద స్థాయిలో పతనం జరిగితే.. దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కూడా పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇది పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసి, పెట్టుబడుల ప్రవాహాన్ని తగ్గించవచ్చని తెలిపింది. అటువంటి పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వల్ల దేశీయ ఆర్థిక పరిస్థితులు మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని RBI వివరించింది.
అయితే ఈ అన్ని ప్రమాదాల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన దేశీయ అంశాలు కూడా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో వినియోగం, పెట్టుబడులు పెరుగుతుండటం, పరిశ్రమలకు తగినంత మూలధనం లభించడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ఆర్థిక వనరులు అందుబాటులో ఉండటం వంటి అంశాలు ప్రతికూల షాక్‌లను తట్టుకునే శక్తిని ఇస్తాయని పేర్కొంది.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండటం, రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉండే అవకాశాలు, ప్రత్యక్ష, పరోక్ష పన్ను సంస్కరణలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నాయని నివేదిక వివరించింది. మొత్తంగా..దేశ ఆర్థిక పురోగతిపై ఆశావహమైన దృశ్యాన్ని RBI ఈ నివేదికలో చిత్రీకరించింది.
ఇక గణాంకాల విషయానికి వస్తే.. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు GDPలో 1.3 శాతానికి చేరుకుంది. ఇది మునుపటి త్రైమాసికంలో 0.3 శాతంగా ఉంది. అయితే బలమైన సేవల ఎగుమతుల కారణంగా ఈ లోటును సులభంగా భర్తీ చేయవచ్చని RBI అభిప్రాయపడింది. అంతేకాకుండా డిసెంబర్ 19, 2025 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 693.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇవి దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా స్థాయిలో ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications