For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ రుణాలతో జాగ్రత్త... ఆర్బీఐ హెచ్చరిక

|

ఆర్ధిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న నేపథ్యంలో పరిస్థితులు మారిపోతున్నాయి. డిమాండ్ తగ్గిపోవడంతో కంపెనీలు నానా కష్టాలు పడుతున్నాయి. కొనుగోలుదారులు ఏది కొనుగోలు చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో అన్ని రంగాల్లోనూ అప్రమత్త ధోరణి కనిపిస్తోంది. డిమాండ్ లేనప్పుడు కంపెనీలు ఉత్పత్తులను తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా ఉద్యోగాలకు కూడా ఎసరు వస్తోంది. దీంతో వివిధ రకాల అప్పులు తీసుకున్న వారు సకాలంలో బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేక పోతున్నారు. బ్యాంకులు కూడా కార్పొరేట్ రుణాలకన్నా ఆర్థికంగా రిటైల్ రుణాలను జారీ చేస్తున్నాయి. కాబట్టి ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ఈ రుణాల చెల్లింపుల పై ప్రభావం ఉండవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. అన్ని రకాల పరిణామాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు రిటైల్ రుణాలపై ఆధార పడటం పట్ల భారత రిజర్వ్ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రుణమేళాలకు భలే స్పందన... 9 రోజుల్లో రూ. 81,700 కోట్ల రుణాల జారీరుణమేళాలకు భలే స్పందన... 9 రోజుల్లో రూ. 81,700 కోట్ల రుణాల జారీ

ఆర్బీఐ ఏమన్నాడంటే...

ఆర్బీఐ ఏమన్నాడంటే...

* బ్యాంకులు తమ దృష్టిని భారీ పారిశ్రామిక రుణాల నుంచి రిటైల్ రుణాలపైకి మళ్లించాయి. ఈ విభాగంలో మొండిప ద్దులు తక్కువ ఉండటమే ఇందుకు కారణం.

* అయితే వివిధీకరణ వ్యూహం అనేది రిస్క్ను ను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. అయితే దీనికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆర్ధిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో వినియోగం మందగించింది. ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి డిమాండ్ ను ప్రభావితం చెయాయవచ్చు. రిటైల్ రుణాల నాణ్యతను కూడా ప్రభావితం చేయవచ్చని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది.

* ప్రస్తుత పరిస్థితుల్లో రిటైల్ ఆస్తుల నాణ్యత ఒత్తిడికి లోనవుతోందని ఆర్బీఐ భావిస్తోంది.

రుణ చెల్లింపుల్లో జాప్యం

రుణ చెల్లింపుల్లో జాప్యం

* ఇప్పటికే రిటైల్ రుణాలు తీసుకున్న వారు తమ చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నట్టు ఆర్బీఐ చెబుతోంది. ముఖ్యంగా ఆటో, టూ వీలర్, వినియోగదారు ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో ఈ సమస్య ఉన్నట్టు క్రెడిట్ రేటింగ్ సిఆర్ ఐ ఎఫ్ హై మార్క్ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

* ఈ నేపథ్యంలో బ్యాంకులు పారిశ్రామిక రుణ వితరణను ప్రారంభించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పారిశ్రామిక రుణాల మూలంగా పెట్టుబడులు మళ్ళీ పుంజుకొని మంచి వృద్ధి రేటు నమోదు కావడానికి అవకాశం ఉంతుందని పారిశ్రామిక వేత్తలు సూచిస్తున్నారు.

 రుణ వితరణలో వృద్ధి ఇలా...

రుణ వితరణలో వృద్ధి ఇలా...

* బ్యాంకుల రుణ వితరణ మరీ అంత గొప్పగా ఏమీ లేదని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.

* నవంబర్ 6వ తేదీతో ముగిసిన పక్షం రోజుల్లో బ్యాంకుల రుణ వితరణ 8 శాతం మేర పెరిగి 98.47 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకు ముందు పక్షము రోజుల్లో రుణ వితరణలో వృద్ధి దాదాపు తొమ్మిది శాతం పెరిగి 98.39 లక్షల కోట్లుగా నమోడయింది.

* ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల ఉద్దీ పన ప్యాకేజీలను ప్రవేశ పెట్టింది. వీటి ద్వారాల ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి పుంజుకుంటుందని ఆశిస్తున్నారు.

English summary

ఆ రుణాలతో జాగ్రత్త... ఆర్బీఐ హెచ్చరిక | RBI warns banks over focus on retail loans

The Reserve Bank of India (RBI) has warned banks’ for their over dependence on retail loans because the slowdown in the economy. retail loan borrowers are delaying their payments.
Story first published: Thursday, December 26, 2019, 8:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X