గతంతో పోలిస్తే కరోనా మొదలైనప్పటి నుంచి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈక్విటీలు, డెరివేటివ్ లు, ఫారెక్స్ మార్కెట్ల ట్రేడింగ్ లలో పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న మోసగాళ్లు, వివిధ మార్గాల్లో వినియోగదారులను ట్రాప్ చేస్తున్నారు. కస్టమర్ల పెట్టుబడి లూటీ చేయడానికి కాచుకుని కూర్చున్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిపై ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసింది.

అప్ డేట్ అయిన అలర్ట్ లిస్ట్
అనధికార ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్ లలో మోసపూరిత విధానాలను ప్రమోట్ చేస్తున్న ఎంటిటీలు/ప్లాట్ ఫారమ్ లు/ వెబ్ సైట్‌ల పేర్లతో కూడిన 'అలర్ట్ లిస్ట్'ని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం అప్ డేట్ చేసింది. 34 సంస్థలతో ఉన్న ఈ జాబితాను మొదటగా గతేడాది సెప్టెంబర్‌లో సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది. కాగా ఇప్పుడు మరికొన్నిటిని జతచేసి మొత్తం సంస్థలను 48కి పెంచింది.

లిస్ట్ లేనంత మాత్రాన అధికారికం కాదు
అలర్ట్ లిస్ట్ లోని అనధికారిక ఎంటిటీలు/ETPలను ప్రమోట్ చేస్తున్న యాప్ లు/ప్లాట్ ఫారమ్ లు/ వెబ్‌సైట్‌ల పట్ల జాగ్రత్త వహించాలని RBI ప్రజలను కోరింది. ఆయా సంస్థల ద్వారా వస్తున్న ప్రకటనలు, శిక్షణ/సలహా సేవలను నమ్మవద్దని సూచించింది. ఒకవేళ ఏదైనా సంస్థ ఈ జాబితాలో లేనంత మాత్రాన, అది అధికారిక ఎంటిటీ అని ధృవీకరించినట్లు కాదని క్లారిటీ ఇచ్చింది.

అలా చేస్తే శిక్షార్హులే..
అందుబాటులో ఉన్న అధీకృత వ్యక్తులు, ETPల జాబితాను RBI వెబ్ సైట్‌లో చూడవచ్చు. ఈ జాబితా ద్వారా ఏదైనా వ్యక్తి/ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ (ETP) అధికారిక స్థితిని తెలుసుకోవచ్చు. అనధికార సంస్థల ద్వారా విదేశీ కరెన్సీతో చేసే లావాదేవీలకు ప్రజలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. FEMA నిబంధనల ప్రకారం వారు శిక్షార్హులన్న విషయం గుర్తుంచుకోవాలి.
More From GoodReturns

GR RBI MPC Poll: ఏప్రిల్‌లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications