డిజిటల్ కరెన్సీ వైపు భారత్ అడుగులు వేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ కరెన్సీ (CBDC) ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు, అమెరికా ఫిన్‌టెక్ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌లతో ఆర్‌బీఐ సంప్రదింపులు జరుపుతోంది.

వర్క్‌షాప్‌లు
ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్‌తో పలు చర్చలు జరిపినట్లు ఎఫ్‌ఐఎస్ సీనియర్ డైరెక్టర్ జూలియా డెమిదోవా తెలిపారు. ఆర్‌బీఐతో ఇప్పటికే పనిచేసిన అనుభవం తమకు ఉందని, సీఐఎస్ వ్యవస్థలతో సీబీడీసీ నిర్వహణ అవకాశాలను చూస్తున్నట్లు వారు వెల్లడించారు. సీబీడీసీలపై అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకర్లతో రౌండ్‌టేబుల్ సమావేశాలు, వర్క్‌షాప్‌లను ఎఫ్‌ఐఎస్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

CBDC
ఆఫ్‌లైన్ చెల్లింపులు, ప్రోగ్రామబుల్ చెల్లింపులు, కొత్త మానిటరీ పాలసీ టూల్‌కిట్, వడ్డీ-బేరింగ్ CBDC, పాక్షిక బ్యాంకింగ్ సమస్యలు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, క్రాస్-బోర్డర్ CBDC చెల్లింపులు వంటి CBDC అంశాలపై ఫిన్‌టెక్ కంపెనీ సెంట్రల్ బ్యాంక్‌లకు సలహా ఇస్తోందని డెమిడోవా చెప్పారు.

ఆ నాలుగు బ్యాంకులు
"ఆర్‌బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాలను పైలట్‌ను అంతర్గతంగా అమలు చేయమని కోరిందని" ఓ అధికారి చెప్పారు. డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నట్లు సాధారణ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

చట్టంలో మార్పులు
ప్రయోగాత్మక ప్రాజెక్ట్ నిర్వహణ కోసం 1934 ఆర్‌బీఐ చట్టంలో సవరణలు చేసినట్లు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ ఛౌద్రీ ఇప్పటికే చెప్పారు. హోల్‌సేల్, రిటైల్ విభాగాల్లో సీబీడీసీని దశలవారీగా అమలు చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications