రూ.99,122 కోట్ల సర్‌ప్లస్‌ను ప్రభుత్వానికి బదలీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుక్రవారం ఆమోదం తెలిపింది. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోని తొమ్మిది నెలలు జూలై 2020-మార్చి 2021కి సంబంధించి వీటిని ట్రాన్సుఫర్ చేయాలని 589వ సమావేశంలో ఆర్బీఐ నిర్ణయించింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో ఆర్బీఐ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించింది. మే 21వ తేదీన ఈ సమావేశం జరిగింది. అలాగే కాంటింజెన్సీ రిస్క్‌ను 5.50 శాతంగా ఉంచాలని నిర్ణయించింది.
ప్రస్తుతం భారత్ కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి ఇది సవాల్‌గా మారింది. రాష్ట్రాల సహకారంతో దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది మోడీ ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ ఇచ్చే ఈ సర్‌ప్లస్ నిధులు ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. ఇప్పటికే కరోనా లాక్ డౌన్, ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ప్రపంచ, దేశీయ సవాళ్లు, కరోనా సెకండ్ వేవ్ నేతృత్వంలో తీసుకున్న సవాళ్లను ఆర్బీఐ సమీక్షించింది. గత ఏడాది ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి కేవలం 44 శాతం సర్‌ప్లస్ లేదా రూ.57,128 కోట్లను బదలీ చేసింది. గత ఏడేళ్ల కాలంలో ఇదే కనిష్టం. అదే సమయంలో 2019లో రూ.1,23,414 కోట్లు బదలీ చేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications