Dollars Sale: దిక్కుతోచని స్థితిలో RBI.. డాలర్లు బేరానికి రెడీ.. ఆ పతనాన్ని ఆపాలంటే తప్పదు మరి!
RBI: దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర ఎనలేనిది. పలు ఆర్థిక సంస్థలను నియంత్రిస్తూ, ఇండియాను వృద్ధి పథంలో నడిపించడానికి అలుపెరుగని పోరాటం చేస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే కొన్ని నిర్ణయాలు కఠినతరమైనా, క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోక తప్పడం లేదు.
స్వదేశీ సంస్థలను కంట్రోల్ చేయడమే కాకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా RBI నియంత్రిస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఫారెన్ కరెన్సీ సర్క్యులేషన్ రిజర్వ్ బ్యాంక్ కనుసన్నల్లోనే జరుగుతుంది. సాధ్యమైనంత వరకు వాటిని ఖర్చుపెట్టడాన్ని అడ్డుకుంటూ, విదేశీ ద్రవ్య నిల్వలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.

అయితే అనుకోని పరిస్థితుల్లో రూపాయి విలువ క్షీణిస్తున్న సమయంలో మాత్రం వెంటనే రంగంలోకి దిగుతుంది. సరిగ్గా ఇప్పుడు అదే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డాలరుతో పోలిస్తే భారత కరెన్సీ విలువ జీవితకాల కనిష్ఠానికి చేరింది. దీంతో రూపీ నష్టాన్ని పరిమితం చేసేందుకు US డాలర్లను RBI విక్రయించాలని చూస్తున్నట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ఆ పని చేయవచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ఇవాళ చాలా ఆసియా కరెన్సీలు క్షీణించగా.. రూపీ నష్టాలు అదుపులోకి వస్తాయని భావించే వారూ ఉన్నారు. గతంలో నవంబర్ 10న 83.42 వద్ద రూపాయి జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే ఈ స్థాయి వద్ద రూపాయి విలువను RBI కాపాడే ప్రయత్నం చేస్తుంటుంది అని ఓ ప్రైవేట్ బ్యాంకుకు సంబంధించిన విదేశీ మారక ద్రవ్య ప్రతినిధి తెలిపారు.


Click it and Unblock the Notifications