RBI Local Cloud: ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ యుగం నడుస్తోంది. ఒకపక్క టాప్ ఎకానమీలు తమ సొంత అవసరాల కోసం దేశీయంగా డేటా సెంటర్లు, స్టోరేజీ ఏర్పాట్లు చేస్తుండగా.. ప్రస్తుతం అదే దారిలో ఇండియా సైతం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆటలోకి దేశీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగటం గమనార్హం.
ఆర్థిక సంస్థలకు దేశీయంగా క్లౌడ్ స్టోరేజ్ సొల్యూషన్‌లను అందించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025లో పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని తాజాగా రాయిటర్స్ నివేదించింది. రిజర్వు బ్యాంక్ తాజా చొరవ అమెరికాకు చెందిన అనేక దిగ్గజ కంపెనీలకు పెద్ద సవాలుగా మారనుందని తెలుస్తోంది. ప్రధానంగా క్లౌడ్ సర్వీస్ వ్యాపారంలో అంతర్జాతీయ ఆటగాళ్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్, ఐబీఎమ్ క్లౌడ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో దేశీయంగా ఈ సేవలను ఆర్బీఐ అందిస్తే పెద్ద ఆటగాళ్లకు ఈ కేటగిరీ వ్యాపారంలో పెద్ద ఎదురుదెబ్బగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.

ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న పెద్ద నిర్ణయంగా చెప్పుకోవచ్చు. దీని నిర్మాణానికి రిజర్వు బ్యాంక్ స్థానిక ఐటీ సంస్థలతో జతకట్టనున్నట్లు సమాచారం. దేశంలోని చిన్న ఆర్థిక సంస్థలకు తక్కువ ఖర్చులోనే క్లౌడ్ సేవలను అందుబాటులోకి తీసుకురావటం లక్ష్యంగా ఈ ప్రత్యామ్నాయం తీసుకురాబడుతోంది. ప్రస్తుతం భారతదేశంలో క్లౌడ్ సేవల మార్కెట్ దాదాపు 8.3 బిలియన్ డాలర్లుగా ఉంది. 2028 నాటికి ఇది 24.2 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది.
ప్రధానంగా ఇండియన్ మార్కెట్లో ఈ వ్యాపారంలో అంతర్జాతీయ ఆగటాళ్లు సింహభాగాన్ని కలిగి ఉన్నట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం, RBI ప్రాజెక్ట్ చెల్లింపులు, ఆర్థిక డేటాను స్థానికీకరించే ప్రయత్నాలతో సమలేఖనం చేయబడింది. అలాగే భారతదేశ డేటా సార్వభౌమత్వ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది.
రానున్న కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టును చిన్న స్థాయిలో పైలెట్ కింద్ ప్రారంభించటానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రాజెక్టుపై పనిచేస్తున్న అధికారి ఒకరు వెల్లడించినట్లు రాయిటర్స్ నివేదించింది. చిన్న బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థల అవసరాలను పరిష్కరించడానికి పైలట్ ప్రోగ్రామ్ క్రమంగా విస్తరించడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి పబ్లిక్ క్లౌడ్ ప్లాన్ గురించి మెుదటి సారిగా రిజర్వు బ్యాంక్ డిసెంబర్ 2022లో వ్యాఖ్యానించింది.
అప్పటి నుంచి ప్రైవేట్ టెక్ కంపెనీల సహకారంతో ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ ప్రారంభ అభివృద్ధిని నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం నిధులు సెంట్రల్ బ్యాంక్ అసెట్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి అలకేట్ చేయబడ్డాయని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో హైదరాబాద్, ముంబైలలో డేటా సెంటర్లు కలిగి ఉన్న ప్రైవేటు కంపెనీలను ఎంపిక ప్రాతిపధికన ఆర్బీఐ ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. మెుత్తానికి ఇది విదేశీ సంస్థ ఆధిపత్యానికి బ్రేక్ వేసేందుకు సిద్ధం అవుతూ మరో యూపీఐ మాదిరి విజయాన్ని సాధించవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications