Loan apps: లోన్ యాప్స్ విషయమై తెలుగు రాష్ట్రాల్లో చెలరేగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది వాటి బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఓ కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది.
అక్రమ రుణ యాప్‌ల విస్తరణ కట్టడి కోసం రిజర్వ్ బ్యాంక్ నూతన విధానం తీసుకురావాలని చూస్తున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇందుకోసం డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ (DIGITA)ని ఏర్పాటు చేయాలని సెంట్రల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ డొమైన్‌లో ఆర్థిక నేరాలను ఎదుర్కొనేందుకు కీలకమైన చెక్‌పాయింట్‌గా ఇది పనిచేయనుంది.

DIGITA నుంచి ధ్రువీకరణ లేని పక్షంలో వివిధ చట్టపరమైన ఏజెన్సీలు వాటిని అనధికార యాప్స్‌గా పరిగణిస్తాయి. ఏజెన్సీ ఏర్పడిన నాటి నుంచి డిజిటల్ లెండింగ్ యాప్స్‌కి ఇదొక నియంత్రణ సంస్థగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యాప్‌ల ధ్రువీకరణతో పాటు వాటి జాబితాతో కూడిన పబ్లిక్ రిజిస్టర్ నిర్వహణ దీని లక్ష్యంగా ఉండనుంది.
మోసపూరిత కార్యకలాపాలు, అనైతిక పద్ధతుల పెరుగుదలు డిజిటల్ లెండింగ్ రంగంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి సమగ్ర ధ్రువీకరణ ప్రక్రియ అవసరం అని ఆర్బీఐ భావించింది. ఇందులో భాగంగా గూగుల్ వైట్‌లిస్టింగ్ కోసం 442 డిజిటల్ లెండింగ్ యాప్‌ల జాబితాను IT మంత్రిత్వ శాఖకు సెంట్రల్ బ్యాంక్ అందించింది.
సెప్టెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు గూగుల్ తన యాప్ స్టోర్ నుంచి 2 వేల 200 డిజిటల్ లెండింగ్ యాప్‌లను తొలగించింది. RBI మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం నుంచి వచ్చిన అభ్యర్థనలను అనుసరించి.. RBI-నియంత్రిత సంస్థలు లేదా ప్లేస్టోర్‌లో REల భాగస్వామ్యంతో పబ్లిష్ కాబడిన యాప్‌లను మాత్రమే అనుమతించే విధానాన్ని గూగుల్ ఇప్పుడు అమలు చేస్తోంది.


Click it and Unblock the Notifications