కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను పొడిగిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)మారటోరియంకు సంబంధించి మరోసారి ఊరట కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు నిలిచిపోవడంతో గతంలో 3 నెలల పాటు ఈఎంఐ తదితరాలపై మారటోరియం విధించింది. ఇప్పుడు లాక్ డౌన్‌ను మే 17వ తేదీ వరకు పొడిగించారు.

3 నెలల పొడిగింపుపై పరిశీలన
వరుసగా లాక్ డౌన్ పొడిగింపు కారణంగా చేతిలో డబ్బులు లేక ప్రజలు, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీసుకున్న రుణాలకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి. మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు అంటే 54 రోజుల పాటు ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపారాలు లేక వ్యాపారులు, ఉద్యోగుల చేతిల్లో డబ్బులు లేవు. లాక్ డౌన్ మళ్లీ పొడిగిస్తారా లేదా కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ ప్రజలకు, పరిశ్రమలకు చేయూత కోసం మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగించే అంశంపరిశీలిస్తోంది.

పొడిగింపుపై విజ్ఞప్తులు
బ్యాంకుల సంఘం, వివిధ వర్గాల నుంచి మారటోరియం పొడిగింపుపై విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆర్బీఐ దీనిని పరిశీలిస్తోంది. ఇప్పటికే దాదాపు రెండు నెలల కాలం వ్యాపారాలు నిలిచిపోయాయి. కోలుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి మారటోరియాన్ని మరింతకాలం పొడించాలని కోరిన దృష్ట్యా ఈ విజ్ఞప్తిని ఆర్బీఐ పరిశీలిస్తోంది.

లాక్ డౌన్ ఎత్తేయగానే చెల్లించలేని పరిస్థితి
వ్యాపారాలు కోలుకోవడానికి సమయం పట్టడంతో పాటు మార్చిలో ప్రకటించిన మారటోరియం మే 31 (ఈ నెలతో) ముగుస్తుంది. వ్యక్తులు, సంస్థలకు ఆదాయాలు లేవు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే చెల్లింపులు జరపలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మరో మూడు నెలలు మారటోరియం విధిస్తే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోరుణగ్రహీతలకు, బ్యాంకులకు కూడా మారటోరియం పొడిగింపు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆర్బీఐ మార్చి 27వ తేదీన మూడు నెలల పాటు మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆదాయాలు లేని వారికి ఇది భారీ ఊరట. కొన్ని బ్యాంకులు మారటోరియం కోసం కస్టమర్లు విజ్ఞప్తి చేస్తే వెసులుబాటు కల్పిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు ఆటో మారటోరియం ఇస్తున్నాయి.


Click it and Unblock the Notifications