సెప్టెంబర్ 30లోగా CTS అమలు చేయాలి, బ్యాంకులకు ఆర్బీఐ
ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా దేశంలోని అన్ని శాఖల్లో ఫోటో ఆధారిత చెక్ ట్రంకేషన్ సిస్టం(CTS)ను అమలులోకి తీసుకు రావాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలను వేగంగా అందించే లక్ష్యంలో భాగంగా కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నది. 2010 నుండి CTS సిస్టం వాడుకలో ఉంది. ప్రస్తుతం దాదాపు1,50,000 లక్షల శాఖల్లో ఇది అమలులో ఉండగా, దాదాపు 18 వేల బ్యాంకు శాఖల్లో లేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ చివరి నుండి దీనిని అన్ని బ్యాంకులు, శాఖలు అందుబాటులోకి తీసుకు రావాలని ఆర్బీఐ ఆదేశించింది.

ఇదీ CTS
చెక్కుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఫిజికల్ మూమెంట్ ప్రాతిపదికన కాకుండా కేవలం ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది. దీనిని చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటారు. చెక్కు ట్రాన్సాక్షన్స్‌లో ఎలాంటి మోసాలు జరగకుండా చూడడం, అన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ ఇమేజ్డ్ ప్రాతిపదికన చెక్కులు వెంటనే క్లియరెన్స్ చేయడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం. గత పదేళ్లుగా వరుసగా ఒక్కో బ్యాంకు ఈ CTSను అందుబాటులోకి తీసుకు వచ్చాయి.

రోడ్ మ్యాప్
చెక్ ట్రంకేషన్ సిస్టం అడాప్షన్‌కు సంబంధించి బ్యాంకులకు స్వేచ్ఛ ఉంది. సంబంధిత బ్యాంకులు దీనిని అమలు చేయడానికి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలి. CTS పాన్ ఇండియా కవరేజ్ కోసం రోడ్ మ్యాప్‌ను ఆర్బీఐకి తెలియజేయాలని, ఏప్రిల్ 30, 2021 నాటికి స్టేటస్ రిపోర్టును సమర్పించాలని బ్యాంకులను ఆదేశించింది ఆర్బీఐ.

అందుకే సీటీఎస్
పేపర్-లెస్ ఆధారిత క్లియరెన్స్ సామర్థ్యం పెంచేందుకు, చెక్కుల సేకరణ, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు, కస్టమర్లకు సేవలు మెరుగు పరిచేందుకు సెప్టెంబర్ 2021 నుండి అన్ని శాఖలు కూడా సీటీఎస్ క్లియరింగ్ మెకానిజం పరిధిలోకి రావాలని తెలిపింది.


Click it and Unblock the Notifications