న్యూఢిల్లీ: కరోనావైరస్ దెబ్బకు కుదేలవుతోన్న స్టాక్ మార్కెట్లపై దృష్టి సారించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వరుసగా నష్టాల బాట పడుతున్న మార్కెట్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్పిడితో సహా విదేశీ మారక మార్కెట్లో ద్రవ్యతను పెంచే చర్యలను చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం కొనుగోలు/అమ్మకాలకు సంబంధించి సోమవారం వేలం నిర్వహిస్తామని తెలిపింది.

డాలర్లు కొనుగోలు లేదా అమ్మకాలు
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మార్కెట్లపై సమీక్ష నిర్వహించిన ఆర్బీఐ... మార్కెట్లోకి అమెరికా డాలర్ల అవసరతను గుర్తించింది. దీంతో అమెరికా డాలర్లు కొనుగోలు లేదా అమ్మకాలు ఆరునెలల పాటు జరపాలని నిర్ణయించిన రిజర్వ్ బ్యాంక్... తద్వారా విదేశీ మారక మార్కెట్లో ద్రవ్యత ఉండేలా చూడాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఇక కొనుగోలు అమ్మకాలకు సంబంధించి వీలైనంత ఎక్కువసార్లు వేలం నిర్వహిస్తామని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అంతేకాదు పలు రకాల ధరలతో ఈ వేలాన్ని నిర్వహిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది.

బ్యాంకులు ఆర్బీఐ నుంచి డాలర్లు కొనుగోలు
ఇక మార్చి 16వ తేదీన 2 బిలియన్ అమెరికా డాలర్లను వేలం వేస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా బ్యాంకులు అమెరికా డాలర్లను ఆర్బీఐ నుంచి కొనుగోలు చేస్తాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో ఈ డాలర్లను నిర్దేశిత సమయంలోగా అమ్మడం జరుగుతుందని వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారితో ఆర్థికపరమైన మార్కెట్లు అన్నీ పతనం దిశగా పయనిస్తున్నాయని చెప్పిన అధికారులు దీనివల్ల అమ్మకాలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు సైతం తగ్గిపోయాయని ఈ ప్రభావం పలు దేశ ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా ఉంటుందని చెప్పారు.

ఇప్పటికే రూ.21 కోట్లు ఉపసంహరణ
కరోనావైరస్ అన్ని వర్గాల పెట్టుబడిదారుల్లో ఒకరకమైన భయాన్ని కలగజేసింది. ఇదే అస్థిరత పెరిగేందుకు దారి తీసింది. అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల్లో మార్కెట్లు కరెన్సీ పరంగా ప్రతికూల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు అమెరికా డాలర్‌తో ఇతర కరెన్సీల మధ్య సమతుల్యత లోపించడమనేది ప్రపంచ వ్యాప్తంగా ఉద్బవించింది. మార్కెట్ సమాచారం ప్రకారం ఇప్పటికే విదేశీ పెట్టుబడిదారులు రూ.21వేల కోట్లు భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం కరోనావైరస్ కావడం విశేషం. ఇదిలా ఉంటే మార్కెట్ల పరంగా ఎలాంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా ఆర్బీఐ వద్ద మార్చి 6నాటికి 487.24 బిలియన్ల అమెరికా డాలర్లు సిద్దంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications