RBI News: మనలో చాలా మందికి పూర్వీకులు బ్యాంకుల్లో చేసిన డబ్బు డిపాజిట్ల గురించి తెలియదు. వారు అప్పట్లో వారసుల వివరాలను అందించకపోవటం వల్ల ఆ డబ్బు బ్యాంకుల వద్దే క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయాయి. అయితే ఆ డబ్బును సరైన యజమానులకు అందించాలని రిజర్వు బ్యాంక్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో తమ టాప్-100 డిపాజిట్లను ట్రేస్ చేయడానికి, వారి డబ్బును సెటిల్ చేయడానికి బ్యాంకుల ఆధ్వర్యంలో 100 రోజుల ప్రత్యేక ప్రచారాన్ని తీసుకొస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రచారాన్ని బ్యాంకులు జూన్ 1, 2023 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లలోని బ్యాలెన్స్ లేదా డిపాజిట్ సొమ్ము మెచ్యూరిటీ తేదీ తర్వాత 10 ఏళ్ల పాటు క్లెయిమ్ చేయకుండా ఉన్నట్లయితే దానిని బ్యాంకులు అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లుగా వర్గీకరిస్తాయి. ఈ క్లెయిమ్ చేయని మొత్తాలను బ్యాంకులు RBI నిర్వహించే "డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్" ఫండ్‌కి బదిలీ చేస్తుంటాయి. తాజాగా రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన క్యాంపెయిన్ కింద టాప్-100 క్లెయిమ్ చేయని డిపాజిట్లను 100 రోజుల్లోగా గుర్తించి సెటిల్ చేయడానికి బ్యాంకుల కోసం '100 రోజులు 100 చెల్లింపులు' ప్రచారాన్ని తీసుకొచ్చింది.
దేశంలోని సెంట్రల్ బ్యాంక్ అనేక బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు ఒక సెంట్రల్ వెబ్ పోర్టల్‌ను కూడా సెట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎవరైనా తమ పూర్వీకులు విడిచిపెట్టిన క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. డిపాజిట్లను క్లెయిమ్ చేయడానికి సంబంధిత బ్యాంకును గుర్తించి ఆశ్రయించేలా సామాన్య ప్రజలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం వెల్లడించిన డేటా ప్రకారం బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఏడాది క్రితం రూ.48,262 కోట్ల నుంచి రూ.35,012 కోట్లకు తగ్గాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications