RBI Monetary Policy: వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన శక్తికాంత దాస్.. పూర్తి వివరాలివే..
RBI News: వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత ఇదే దారిలో భారత సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కూడా నడిచింది.
ఈ క్రమంలో రిజర్వు బ్యాంక్ రెపో రేటును 6.5 శాతం వద్ద మార్పులు లేకుండా కొనసాగించాలని నిర్ణయించింది. దీనికి ముందు జూన్ మాసంలో సైతం ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో సైతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. ఆగస్టులో సైతం వరుసగా తొమ్మిదోసారి రేట్లలో ఎలాంటి మార్పులు ప్రకటించకపోవటం గమనార్హం.

దీంతో గడచిన 25 ఏళ్లలో రెండవసారి గరిష్ఠంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గించనుందనే ఊహాగానాలు కొనసాగుతున్న వేళ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు మంచి రాబడులను అందించవచ్చని మిరే అసెట్ నిపుణులు మహేంద్ర కుమార్ జజో పేర్కొన్నారు.
వాస్తవానికి దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లను తగ్గించటానికి వీలు కల్పించటం లేదని తెలుస్తోంది. వాస్తవానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తాజా నివేదికలో సైతం ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో కూడా ద్రవ్యోల్బణం పరిస్థితి రుతుపవనాల వర్షాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదుకావటం ఆందోళన కలిగిస్తోందని చెప్పింది. ఆహారం నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం పరంగా ఇండియా రష్యా తర్వాత రెండవ స్థానంలో ఉందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications