Nirmala Sitharaman: ఈ రోజు పార్లమెంటు వేదికగా క్రిప్టో కరెన్సీలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌బీఐ క్రిప్టోపై ప్రభుత్వ సంప్రదింపుల పత్రం కోసం వేచి ఉన్నందున సీతారామన్ మాట్లాడారు. క్రిప్టోకరెన్సీల కోసం నిబంధనలను రూపొందించి, క్రిప్టోలను నిషేధించాలని రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సమర్థవంతమైన నియంత్రణ లేదా నిషేధం కోసం "ప్రపంచ సహకారం" అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్లు ఆర్థిక మంత్రి వ్యాఖ్యల ద్వారా అర్థమౌతోంది.

లిఖిత పూర్వక సమాదానం..
ఆర్థిక స్థిరత్వంపై క్రిప్టోకరెన్సీల అస్థిరత ప్రభావంపై RBI వ్యక్తం చేసిన ఆందోళనల దృష్ట్యా.. ఈ రంగంపై చట్టాన్ని రూపొందించాలని రిజర్వు బ్యాంక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని RBI అభిప్రాయపడిందని ఆర్థిక మంత్రి లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
బౌండరీస్ లేని స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని వీటి కట్టడిలో అంతర్జాతీయ సహకారం అవసరమని సీతారామన్ అన్నారు. వీటిపై ఎలాంటి చట్టబద్ధమైన చర్యలు చేపట్టడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని, దాని ద్వారానే రిస్క్, లాభాలను అంచనా వేసి టాక్స్ పరిధిలోకి తీసుకొచ్చి నియంత్రించగలమని ఆమె అన్నారు.

ఊహాగానాల మధ్య ఇలా..
ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో క్రిప్టో రంగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చట్టాన్ని ప్రవేశపెట్టగలదన్న ఊహాగానాల మధ్య సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. అటువంటి బిల్లు ఏదీ ప్రవేశపెట్టడానికి జాబితా చేయబడలేదు. ప్రభుత్వం ప్రస్తుతం పని చేస్తున్న క్రిప్టో కన్సల్టేషన్ పేపర్‌పై అందరి దృష్టి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు.

క్రిప్టోలపై ప్రధాని కసరత్తు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవలి నెలల్లో క్రిప్టో వాడకం వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి ఉమ్మడి ప్రపంచ చర్య కోసం పిలుపునిచ్చారు. క్రిప్టోపై చట్టం కోసం వేచి ఉండగా.. RBI తన సొంత డిజిటల్ కరెన్సీని దేశంలో ప్రవేశ పెట్టేందుకు పని చేస్తోంది. ఈ ఏడాది దానిని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. సెంట్రల్ బ్యాంకులు తీసుకొచ్చే డిజిటల్ కరెన్సీలు ప్రైవేటు క్రిప్టోకరెన్సీలకు ముగింపు పలక వచ్చని RBI డిప్యూటీ గవర్నర్ టి. రబీ శంకర్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications