అదానీ గ్రూపులకు ఆయా బ్యాంకులు రుణాలు ఇచ్చినప్పటికి కూడా... దేశ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థను లాభదాయకం అని సూచించే పలు పారామీటర్లు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.ముఖ్యంగా అసెట్ క్వాలీటీ,లిక్విడిటీ లాంటి సూచికల ప్రదర్శన మెరుగ్గా ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.అదాని గ్రూప్స్ కుదుపుతో అప్రమత్తమైన ఆర్బీఐ, బ్యాంకింగ్ వ్యవస్థను చాలా దగ్గరగా సమీక్షిస్తోంది.అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండేందుకు ఆర్బీఐ అన్ని చర్యలు తీసుకుంటోందిన స్పష్టం చేసింది.
అదానీ గ్రూపులకు పలు బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు అనేక కోణాల్లో కథనాలు ప్రచురించాయి. దీంతో స్వయంగా ఆర్బీఐ రంగంలోకి దిగి భారత బ్యాంకింగ్ వ్యవస్థకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పింది. అయితే ఎక్కడా అదానీ పేరు ప్రస్తావించకుండా ఆర్బీఐ చెప్పాల్సింది చెప్పేసి.. క్లారిటీ ఇచ్చేసింది. ఏ బ్యాంకులైతే రూ.5 కోట్ల కంటే భారీ రుణాలు ఇస్తుందో అలాంటి సమాచారం మొత్తం ఆర్బీఐ మెయిన్‌టెయిన్ చేస్తుంది.దీన్నే సెంట్రల్ రిపాజిటరీ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (CRILC) అని అంటారు.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్స్‌పై ఇచ్చిన నివేదికతో అదానీ స్టాక్స్ విలువ మార్కెట్ విలువ కంటే సగానికి పైగా నష్టాల్లోకి వెళ్లాయి. అయితే హిండెన్ బర్గ్ వెల్లడించిన రిపోర్టు సత్యదూరమని చెబుతూ ఆ నివేదికను అదానీ సంస్థ ఖండించింది.కేవలం భారత మార్కెట్లపై దాడి చేసి ఆర్థికంగా హిడెన్‌బర్గ్ సంస్థ లాభపడేందుకు చేసిన కుట్రగా అదానీ సంస్థ అభివర్ణించింది.ఇదిలా ఉంటే ఎఫ్‌పీఓలను కూడా తిరిగి చెల్లించేందుకు అదానీ సంస్థ నిర్ణయం తీసుకుంది. మార్కెట్ కుదుపుల నేపథ్యంలో ముందుకు కొనసాగారాదని,ఎఫ్‌పీఓలను తిరిగి పెట్టుబడిదారులకు చెల్లించాలని అదానీ సంస్థ నిర్ణయించుకుందంటూ వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications