దేశంలో పెద్దనోట్లను క్లీన్ నోట్ పాలసీ కింద కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో రూ.2000 నోట్లను ప్రజల నుంచి బ్యాంకులు, పోస్టాఫీసులు, రిజర్వు బ్యాంక్ కార్యాలయాల ద్వారా ఆర్బీఐ వెనక్కి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో డిసెంబర్ 1, 2023న వీటికి సంబంధించి రిజర్వు బ్యాంక్ కీలక ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటి వరకు మెుత్తం సర్క్యూలేషన్లోని రూ.2,000 నోట్లలో 97.26 శాతం వెనక్కి తిరిగి వచ్చాయని ప్రకటించింది. ఇదే క్రమంలో ఇంకా వెనక్కి రావాల్సిన 2.74 శాతం నోట్ల చెలామణి విలువ రూ.9,760 కోట్లుగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికీ ఇంకా నోట్లను హోల్డ్ చేస్తున్న వ్యక్తులు వాటిని వెసులుబాటును కొనసాగిస్తోంది.

వాస్తవానికి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయటం ద్వారా రూ.2000 నోట్లను వెనక్కి తీసుకునేందుకు గడువు రెండు నెలల కిందటే ముగిసింది. మే 19, 2023లో రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టిన ప్రయోజనం పూర్తైందని అందువల్ల వాటిని చెలామణి నుంచి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మే 19వ తేదీ నుంచి జులై 31వ తేదీ నాటికి 88 శాతం మేర నోట్లు తమ వద్ద జమ అయినట్లు ఆర్బీఐ గతంలో నివేదించింది.
రిజర్వు బ్యాంక్ దేశంలో తనకు ఉన్న 19 కేంద్రాల్లో రెండు వేల నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటును కొనసాగిస్తోంది. అయితే తాజాగా ముంబైలోని బేలాపూర్ రిజర్వు బ్యాంక్ కార్యాలయం వద్ద అనేక మంది రూ.2000 నోట్లను మార్చుకునేందుకు భారీగా రావటంతో పెద్ద క్యూ ఏర్పడింది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తమ వద్ద చిన్న మెుత్తంలో ఉన్న నోట్లను మార్చుకునేందుకు వచ్చారు. అయితే ముంబై మహానగరంలో స్థలం కొరత కారణంగా రోడ్డు పక్కనే కార్యాలయం ఉండటం వల్ల ఇతర ఆఫీసుల్లో మాదిరిగా టెంట్ వంటి ఏర్పాటు చేయటం కుదరలేదని అధికారులు చెబుతున్నారు. మెుత్తానికి ప్రజలు ఇప్పటికీ తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకుంటూనే ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications