ఆర్బీఐ అంబుడ్స్‌మెన్ స్కీం, ఫిర్యాదు ఎలా చేయవచ్చు?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్ తీసుకు వచ్చింది. ఈ పథకంతో బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులతో సహా ఆర్థిక సేవలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం సులభతరం అవుతుంది. ఐవోఎస్ కింద బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు(NBFC)లు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన ఫిర్యాదులను ఒకేచోట నమోదు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న అంబుడ్స్‌మెన్ పథకాలను ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ ద్వారా ఒకే పథకంలో విలీనం చేయడం వల్ల ఒకే ప్లాట్‌ఫాం ద్వారా కస్టమర్లకు ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ పథకాన్ని ప్రధాని మోడీ నవంబర్ 12న ప్రారంభించారు.

మూడు అంబుడ్స్‌మెన్ స్కీంలు... ఒక్కటిగా

మూడు అంబుడ్స్‌మెన్ స్కీంలు... ఒక్కటిగా

బ్యాంకింగ్, NBFC, డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఇప్పటి వరకు మూడు వేర్వేరు అంబుడ్స్‌మెన్ పథకాలు ఉన్నాయి. బ్యాంకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుల కోసం బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ స్కీం(BOS), NBFC కోసం ది అంబుడ్స్‌మెన్ స్కీమ్ ఫర్ నాన్-బ్యాంకంగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం అంబుడ్స్‌మెన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బ్యాంకుల కోసం BoS 1995 నుండి, ఎన్బీఎఫ్‌సీ అంబుడ్స్‌మెన్స్ స్కీం 2018 నుండి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంబుడ్స్‌మెన్ స్కీం 2019 నుండి పని చేస్తున్నాయి. ఇప్పుడు ఈ మూడింటిని ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మెన్ వ్యవస్థగా ఏకీకృతం చేసి సేవలు అందిస్తారు.

ఏ భాషలో అయినా ఫిర్యాదు

ఏ భాషలో అయినా ఫిర్యాదు

రూ.50 కోట్లు, అంతకంటే ఎక్కువ డిపాజిట్స్ కలిగిన నాన్-షెడ్యూల్డ్ ప్రాథమిక సహకార బ్యాంకులు కూడా దీని కిందకే వస్తాయి. వినియోగదారు ఆర్థిక సంస్థ అంతర్గత ఫిర్యాదుల పరిష్కార విధానంతో సంతృప్తి చెందకపోతే అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు.

ఫిర్యాదుదారు ఏ స్కీం కింద అంబుడ్స్‌మెన్‌‌కు ఫిర్యాదు చేస్తున్నారో గుర్తించాల్సిన అవసరం లేదు. స్కీంలో జాబితా చేయబడిన కారణాల కింద కవర్ కాలేదనే కారణంతో ఫిర్యాదులు తిరస్కరణకు గురికాకుండా విస్తృత సేవలు అందుతాయి.

ఏ భాషలో అయినా ఫిర్యాదులు చేయవచ్చు. ప్రారంభ నిర్వహణ కోసం చండీగఢ్‌లో రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

ఖాతా ఎక్కడున్నా దాని యజమాని ఎక్కడి నుండి అయినా అంబుడ్స్‌మెన్‌‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఆన్ లైన్ మోసాల పరిష్కారానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తారు. దీంతో బ్యాంకు, దర్యాఫ్తు ఏజెన్సీల మధ్య తక్కువ సమయంలోనే సమన్వయం సాధ్యమవుతుంది.

ఫిర్యాదును నమోదు చేయడంతో పాటు స్టేటస్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. సంబంధిత పత్రాలను సమర్పించవచ్చు. ఫీడ్ బ్యాక్ ఉంటుంది.

అంబుడ్స్‌మెన్ జారీ చేసిన అవార్డును అప్పీల్ చేసే హక్కు నియంత్రిత సంస్థకు లేదు.

ఫిర్యాదు

ఫిర్యాదు

ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థలో కస్టమర్లు వారి ఫిర్యాదును ఫైల్ చేయవచ్చు. చండీగఢ్ సెంటర్‌కు ఈ మెయిల్ లేదా లేఖ ద్వారా సమాచారం అందించవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ 14448 ద్వారా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి, హిందీ, ఇంగ్లీష్ సహా ఎనిమిది ప్రాంతీయ భాషల్లో ఫిర్యాదు చేయవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+