Banking News: నగదు విత్‌డ్రా చేసేందుకు ఎక్కువ మంది ఉపయోగించే మార్గం ATM. అయితే ఒక్కోసారి నిర్వహణలో పొరపాటు, మిషన్లో లోపం వలన చిరిగిన నోట్లు వస్తూ ఉంటాయి. వాటిని ఎక్కడ, ఎలా మార్చుకోవాలో అర్థం కాక చాలామంది సతమతం అవుతుంటారు. మరికొందరు దళారులను ఆశ్రయించి వారికి కమిషన్ చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఆ అవసరం లేదు అని RBI చెబుతోంది.
RBI నిబంధనల ప్రకారం ATM నుంచి చిరిగిన నోట్లు వచ్చిన క్రమంలో బ్యాంకుల వద్ద ఆ నోట్లను చాలా తేలికగా మార్చుకోవచ్చు. నిమిషాల వ్యవధిలోనే పని పూర్తవుతుంది. అయితే ఆ లావాదేవీకి సంబంధించి పూర్తి వివరాలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ATM నుంచి ఎప్పుడు, ఎక్కడ నగదు విత్‌డ్రా చేశారనే సమాచారాన్ని బ్యాంకుకు సవివరంగా తెలియజేయాలి.

రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ కార్యాలయం సహా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఇలా చిరిగిన నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. కనీసం 10 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన నోట్లు మాత్రమే ఈ విధంగా మార్చుకోవడానికి RBI అనుమతిస్తోంది. అంతకుమించి తక్కువ విలువైన నోట్లను బ్యాంకులు మార్చవు.
కాలిపోయిన లేదా నలిగిపోయిన నోట్ల విషయంలో నిబంధనలు వేరుగా ఉంటాయి. పైన పేర్కొన్న నిబంధనలు కేవలం ATM నుంచి నగదు విత్‌డ్రా సమయంలో చిరిగిపోయిన నోట్లకి మాత్రమే వర్తిస్తుందని గుర్తించాలి. బ్యాంకులు ఈ నిబంధనలను అమలు చేయడానికి నిరాకరిస్తే నిరభ్యంతరంగా RBI వద్ద కంప్లైంట్ నమోదు చేయవచ్చు. సదరు ఫిర్యాదుపై RBI చర్యలు తీసుకుంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications