RBI Rule: ఈ రోజుల్లో గ్రామ స్థాయి నుండి పట్టణాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. డిజిటల్ యుగం నడుస్తున్న కాలంలో బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎవరూ ఉండరు. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే.. జన్ ధన్ పథకం ద్వారా దేశంలోని కోట్ల మంది తమ పేరుపై బ్యాంక్ ఖాతాను ప్రారంభించారు. చాలామంది కస్టమర్లు తమ పొదుపు ఖాతాల్లో లేదా FDల రూపంలో డబ్బును దాచుకుంటూ ఉంటారు.అయితే ఆ డబ్బు ఎంత వరకు సురక్షితంగా ఉంటుందో చాలా మందికి స్పష్టత ఉండదు.
ఒకవేళ మీకు అకౌంట్ ఉన్న బ్యాంకు దివాళా తీస్తే.. మీ డబ్బు కొంత మొత్తం వరకు మాత్రమే సురక్షితంగా ఉంటుంది. మీరు ఎక్కువ డబ్బు జమ చేసి ఉంటే ప్రమాదంలో పడవచ్చు. ఈనేపథ్యంలో బ్యాంకు దివాళా తీసిన సందర్భంలో ఎంత మొత్తానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. బ్యాంకులో డబ్బు ఉంచడం ఎంత వరకు సురక్షితం..ఆర్బీఐ హామీ ఎంత వరకు వర్తిస్తుంది? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సాధారణంగా బ్యాంకులు నష్టాల్లోకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గతంలో చూసుకున్నట్లయితే యెస్ బ్యాంక్, పంజాబ్ & మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC Bank) వంటి బ్యాంకుల నష్టాల్లోకి వెళ్లి దివాలా తీసిన సందర్భాలు ఉన్నాయి.అటువంటి సందర్భాల్లో అలాంటి బ్యాంకులో ఖాతాలు ఉన్న ఖాతాదారుల డబ్బు ప్రమాదంలో పడే అవకాశముంది. అదే సమయంలో..బ్యాంకులో జరిగిన దొంగతనాలు, సైబర్ ఫ్రాడ్‌లు, లేదా ప్రకృతి వైపరీత్యాల వలన డబ్బు నష్టపోయిన సందర్భంలో బ్యాంకు పూర్తిగా బాధ్యత తీసుకోవడం సాధ్యపడదు. కాబట్టి మీ బ్యాంక్ ఖాతాలో ఎంత మొత్తంలో డబ్బు ఉంచుకోవడం సురక్షితం అనే దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
RBI & DICGC ద్వారా హామీ ఎంత : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) చట్టం ప్రకారం చూస్తే.. భారతదేశంలోని అన్ని కమర్షియల్ బ్యాంకులు, పబ్లిక్ మరియు ప్రైవేట్ బ్యాంకులు DICGC కింద నష్టాన్ని కవర్ చేస్తాయి. ఈ చట్టం ప్రకారం చూసుకుంటే.. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం మీద రూ. 5 లక్షల వరకు మాత్రమే హామీ ఉంటుంది. అంతకు మించి ఎటువంటి హామీ ఉండదు.
అయితే ఇది ఒక్క నగదు రూపంలో ఉన్న డబ్బుకు మాత్రమే కాదు.. పొదుపు ఖాతా, FD, కరెంట్ ఖాతా ఇలా ఏ రూపంలో ఉన్నా ఖాతాదారునికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు మాత్రమే ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీని ప్రకారం ఉదాహరణను చూసుకున్నట్లయితే ఒకే వ్యక్తి ఒకే బ్యాంకులో FD + పొదుపు ఖాతాలో కలిపి రూ. 10 లక్షలు ఉంచాడనుకుందాం. ఆ బ్యాంకు దివాళా తీసినప్పుడు అతనికి ప్రభుత్వం నుండి వచ్చే మొత్తం కేవలం రూ. 5 లక్షలు మాత్రమే ఉంటుంది.
వేర్వేరు బ్యాంకుల్లో డబ్బు ఉంచితే పరిస్థితి: మీరు ఒక బ్యాంకులో కాకుండా వేరు వేరు బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉన్నప్పుడు ఈ నియమం వేరేగా ఉంటుంది. ఈ చట్టం ప్రకారం మీరు ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉన్నారో అన్ని బ్యాంకుల్లో మీకు రూ. 5 లక్షల వరకు రీఫండ్ హామీ ఉంటుంది.మీరు SBI, ICICI, HDFC బ్యాంకులో వేర్వేరు ఖాతాలు కలిగి ఉంటే ఆ బ్యాంకులు ఒకవేళ దివాలా తీసిన సందర్భంలో వాటి ఒక్కో బ్యాంకులో రూ.5 లక్షల వరకు మీరు హామీని పొందవచ్చు.
నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. మీ డబ్బు సురక్షితంగా ఉండాలంటే మీ దగ్గర ఉన్న నిధులను వేర్వేరు బ్యాంకుల్లో భద్రపరుచుకోవడం చాలా ఉత్దమమైన మార్గం. ఎవరైనా FDలు చేసేప్పుడు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని తప్పకుండా పరిశీలించాలి. DICGC హామీ ఉన్న బ్యాంకులలోనే డిపాజిట్లు చేయాలి. ఆ బ్యాంకు ఒకవేళ దివాలా తీసినప్పుడు మీకు రూ. 5 లక్షలు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

GR RBI MPC Poll: ఏప్రిల్లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications