భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI).. రివ్యూ మీటింగ్ లో రెపో రేటును యధాతథం (5.25 శాతం) గా కొనసాగించాలని నిర్ణయించింది. చాలా మంది గృహ కొనుగోలుదారులు వడ్డీ రేట్లు తగ్గట్లేదని నిరాశ చెంది ఉంటారు. అయితే ఈ నిర్ణయం నిరాశ కలిగించేదేమీ కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రేట్ల తగ్గింపు లేకపోయినా ఈ నిర్ణయం సామాన్యులకు, రియల్ ఎస్టేట్ రంగానికి మేలు చేస్తుందని అంటున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

EMI షాక్ ఉండదు
ప్రస్తుతం హోమ్ లోన్ కడుతున్న వారికి అతిపెద్ద ఊరట ఏమిటంటే.. వారి నెలవారీ ఈఎంఐలు (EMI) పెరగవు. ఇప్పటికే పెరిగిన ఖర్చులతో బడ్జెట్ సర్దుబాటు చేసుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలకు, వడ్డీ రేట్లు పెరగకపోవడం ఒక పెద్ద రిలీఫ్. దీనివల్ల తమ ఆర్థిక ప్రణాళికలను ఎటువంటి అదనపు భారం లేకుండా కొనసాగించుకోవచ్చు.
కొత్తగా ఇల్లు కొనేవారికి స్పష్టత
కొత్తగా ఇల్లు కొనేవారికి ఇప్పుడు మార్కెట్‌లో ఒక క్లారిటీ వచ్చింది. వడ్డీ రేట్లు ఇప్పుడప్పుడే మారవు. కాబట్టి రాబోయే నెలల్లో తమ అప్పు ఎంత ఉంటుంది? నెలవారీ ఎంత చెల్లించాలి? అనే విషయంలో ఒక ఖచ్చితమైన ప్లాన్ వేసుకోవచ్చు. అనరాక్ (ANAROCK) గ్రూప్ ఛైర్మన్ అనూజ్ పురి అభిప్రాయం ప్రకారం.. ఈ నిర్ణయం వల్ల కొనుగోలుదారులు గందరగోళం లేకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయితే మధ్యతరగతి , సరసమైన ధరల ఇళ్ల (Affordable Housing) విభాగం అభివృద్ధి చెందాలంటే భవిష్యత్తులో రేట్ల కోత అవసరమని ఆయన పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ రంగం ఏమంటోంది?
నహర్ గ్రూప్ వైస్ ఛైర్‌పర్సన్ మంజు యాగ్నిక్ మాట్లాడుతూ.. RBI నిర్ణయం వల్ల పాలసీలో 'స్థిరత్వం' ఏర్పడిందని తెలిపారు. ఫ్లోటింగ్ రేట్ వడ్డీపై రుణాలు తీసుకున్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనేవారు ఎటువంటి భయం లేకుండా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చని ఆమె చెప్పారు. డెవలపర్లకు కూడా తమ ప్రాజెక్ట్ ఖర్చులను అంచనా వేయడానికి ఈ స్థిరత్వం తోడ్పడుతుంది.
ఎఫర్డబుల్ హౌసింగ్ పరిస్థితి
గణాంకాల ప్రకారం.. గత కొన్ని ఏళ్లుగా తక్కువ ధరల ఇళ్ల విక్రయాలు తగ్గుతూ వస్తున్నాయి. 2019 లో మొత్తం ఇళ్ల అమ్మకాల్లో 38 శాతంగా ఉన్న అఫర్డబుల్ హౌసింగ్ వాటా.. 2025 నాటికి 18 శాతానికి పడిపోయింది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో బడ్జెట్ 2026-27లో ఈ రంగానికి పెద్దగా ఊరట లభించకపోవడం కొసమెరుపు. అయినప్పటికీ ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథంగా ఉంచడం వల్ల సామాన్యులు తమ సొంత ఇంటి కలపై ఆశలు వదులుకోకుండా ఉన్నారు.
మొత్తం మీద ఆర్‌బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గకపోయినా.. అవి పెరగకపోవడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సానుకూల అంశమే. ఇల్లు కొనేందుకు ప్లాన్ చేసే వారికి ఇది ఒక సానుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications