భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలకమైన రెపో రేటు (Repo Rate) ను 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బెంచ్‌మార్క్ రేటు 5.50 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గింది. RBI గవర్నర్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక వాతావరణాన్ని "అరుదైన గోల్డీలాక్స్ పీరియడ్"గా అభివర్ణించారు. ఎందుకంటే జీడీపీ వృద్ధి బలంగా ఉంది. ద్రవ్యోల్బణం (Inflation) అదుపులో ఉంది. అయితే ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్లను (FD)లను కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంది. అదెలాగంటే..

సాధారణంగా రెపో రేటు కోత అనేది బ్యాంకులు తమ అప్పుల వడ్డీ రేట్లను తగ్గించుకోవడానికి దారితీస్తుంది. ఇది కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposits - FD) పై వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తుంది. దీంతో మీ FDలపై తక్కువ రాబడి లభించే అవకాశం ఉంది.
పాత / కొత్త FD లపై ప్రభావం..
- ఇప్పటికే ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు : RBI కొత్త వడ్డీ రేట్ల వల్ల మీరు ఇప్పటికే వేసిన FD లపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఒకసారి FD బుక్ చేసిన తర్వాత, దాని వడ్డీ రేటు ఆ మొత్తం కాలానికి (Tenure) 'లాక్' చేయబడుతుంది. రెపో రేటు కోత కేవలం కొత్త డిపాజిట్లు లేదా పునరుద్ధరణలపై మాత్రమే ప్రభావం చూపుతుంది.
- కొత్త FD వడ్డీ రేట్లు: రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు RBI నుండి తక్కువ ఖర్చుతో అప్పు తీసుకోవచ్చు. అందువల్ల బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. 25 బేస్ పాయింట్ల కోత.. కొత్త FD రేట్లను 10 నుంచి 25 bps వరకు తగ్గిస్తుంది.
- స్వల్పకాలిక FD లు: 3 నుంచి 12 నెలల మధ్య ఉండే స్వల్పకాలిక FD లు పాలసీ మార్పులకు త్వరగా స్పందిస్తాయి. RBI ఇటీవల ప్రకటించిన రూ.1 లక్ష కోట్ల బాండ్ల కొనుగోలు అలాగే 5 బిలియన్ డాలర్ల ఫారెక్స్ స్వాప్ వంటి చర్యల కారణంగా ఈ షార్ట్ టర్మ్ FD రేట్లను త్వరగా తగ్గించే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
రెపో రేటు కోత తో FDలపై రాబడి కచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ రిటర్న్స్ ఆశించేవాళ్లు FDలలో ఇన్వెస్ట్ చేయడం సరైన ఆప్షన్ కాదంటున్నారు నిపుణులు. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అదెలాగంటే..
- త్వరగా లాక్ చేసుకోండి: అధిక రాబడిని పొందాలనుకునే వారు, బ్యాంకులు రేట్లను సవరించడానికి ముందే FD లను బుక్ చేసుకోవడం మంచిది.
- FD లాడరింగ్ (FD Laddering): ఆర్పీఎస్ గ్రూప్ డైరెక్టర్ శశాంక్ గుప్తా వంటి నిపుణులు FD లాడరింగ్ ను సిఫార్సు చేస్తున్నారు. దీని ద్వారా.. పెట్టుబడిదారులు తమ డిపాజిట్లను వేర్వేరు కాలవ్యవధులలో (Tenures) విభజిస్తారు. దీనివల్ల మొత్తం డబ్బు తక్కువ రేట్ల వద్ద చిక్కుకోకుండా ఉంటుంది. భవిష్యత్తులో రేట్లు పెరిగితే, మెచ్యూర్ అయిన డిపాజిట్‌ను ఆ అధిక రేటు వద్ద మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు.
- సీనియర్ సిటిజన్ల కోసం: రాబడితోపాటు మెరుగైన భద్రత కోసం బ్యాంకు FD లతోపాటు కార్పొరేట్ FD లు, చిన్న పొదుపు పథకాల (Small Savings Schemes).. ఇలా అన్నింటిలో కొంతకొంత ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications