RBI News: ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ వృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో వివిధ రకాల రుణాలు రైతం అదే స్థాయిలో ఎగసిపడుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. క్రెడిట్ కార్డుల నుంచి అగ్రికల్చర్, వ్యక్తిగత మరియు హౌసింగ్ రుణాలు భారీ స్థాయిలో ఏటా పెరుగుతూ పోతున్నట్లు తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లు 22 శాతం పెరిగి 2.8 లక్షల కోట్లకు చేరాయి. RBI విడుదల చేసిన సెక్టోరల్ డేటాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్‌గా ఇది నిలిచింది. జూలైలో క్రెడిట్ కార్డ్ బకాయిలు మొత్తం బ్యాంకు రుణాలలో 1 శాతంగా ఉన్నాయని పేర్కొంది. వ్యక్తిగత రుణాల విషయానికి వస్తే బంగారు ఆభరణాలపై లోన్స్ గణనీయంగా 39 శాతం పెరిగాయని వెల్లడించింది. మొత్తం బ్యాంక్ క్రెడిట్‌లో వీటి వాటా 0.8 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

ఇక వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన రుణాల్లోనూ భారీ వృద్ధి కనిపించినట్లు RBI తెలిపింది. ఏడాది క్రితం ఉన్న 16.7 శాతంతో పోలిస్తే 2024 జూలైలో 18.1 శాతం పెరుగుదల నమోదైనట్లు వెల్లడించింది. పరిశ్రమలకు క్రెడిట్‌ను గతేడాదితో పోలిస్తే రసాయనాలు మరియు రసాయన ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోలియం, బొగ్గు ఉత్పత్తులు మరియు అణు ఇంధనాలు, మౌలిక సదుపాయాలు జూలై 2024లో అధిక వృద్ధిని నమోదు చేశాయని పేర్కొంది.
సెగ్మెంట్‌లో అతిపెద్ద విభాగంగా చెప్పబడే 'హౌసింగ్' క్రెడిట్ వృద్ధి అధిక రేటుతో పెరిగినట్లు సెంట్రల్ బ్యాంక్ వివరించింది. జూలై 2023లోని 4.6 శాతంతో పోలిస్తే జూలై 2024 నాటికి 10.2 శాతం వృద్ధి కనబరిచినట్లు స్పష్టం చేసింది. ప్రాథమిక మెటల్ మరియు మెటల్ ఉత్పత్తులు, వస్త్రాల క్రెడిట్ రేటు 'మోడరేట్'గా ఉన్నట్లు చెప్పింది. కాగా కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం భారత ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదించింది. 6.7 శాతం వృద్ధితో RBI అంచనా 7.1 శాతాన్ని అందుకోలేక పోయింది.


Click it and Unblock the Notifications