RBI On Loan Apps: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల రుణాల పేరుతో జరుగుతున్న మోసాన్ని కట్టడి చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మొబైల్ యాప్ నుంచి లోన్స్ పేరుతో మోసాల నివారణకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.

కొత్త నిబంధనల ప్రకారం..
డిజిటల్ రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నేరుగా కస్టమర్ బ్యాంక్ ఖాతాలోకి రుణ మొత్తాన్ని క్రెడిట్ చేయాల్సిందే. దీని కోసం వారు ఏ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించరు. లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ (LSP) ద్వారా ఏదైనా పొరపాటు జరిగినప్పటికీ.. సదరు NBFC కంపెనీ బాధ్యతగా పరిష్కరించవలసి ఉంటుంది.

కూలింగ్-ఆఫ్ సమయం..
మార్గదర్శకం ప్రకారం వార్షిక శాతం రేటు (APR) అన్ని రకాల నిధుల ఖర్చు, క్రెడిట్ ఖర్చు, నిర్వహణ వ్యయం, ప్రాసెసింగ్ రుసుము, ధృవీకరణ ఛార్జీలు, నిర్వహణ ఛార్జీలను కలిగి ఉంటుంది. రుణాన్ని కొనసాగించని పక్షంలో కస్టమర్కు కూలింగ్-ఆఫ్ వ్యవధిని అందించాలి. దీనిలో కస్టమర్ రుణం నుంచి నిష్క్రమించవచ్చు. లోన్ అందిస్తున్న సంస్థ బ్యాంక్ ఖాతా నుంచి చెల్లింపు నేరుగా కస్టమర్ బ్యాంక్ ఖాతాలో మాత్రమే చేయబడుతుంది.

అవుట్ స్టాండింగ్ మొత్తంపై వడ్డీ వసూలు..
వడ్డీ ఛార్జ్ స్టాండింగ్ లోన్ మొత్తంపై ఉంటుంది. అలాగే కంపెనీ వాస్తవ ప్రకటనలో APR (వార్షిక శాతం రేటు) ప్రకటించాల్సిందే. కంపెనీకి లోన్ ఇచ్చే సమయంలో మాత్రమే రికవరీ ఏజెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని కస్టమర్‌కు వెల్లడించాల్సి ఉంటుంది. కస్టమర్ వ్యక్తిగత డేటాకు సంబంధించిన బాధ్యత రుణం ఇచ్చే సంస్థపై ఉంటుంది.

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు సమాచారం..
రుణం ఇచ్చే కంపెనీ కస్టమర్ లోన్ సమాచారాన్ని ఇకపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలతో పంచుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ ఆమోదం లేకుండా కంపెనీ ఎలాంటి డేటా షేరింగ్ చేయకూడదని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి రుణం ఇచ్చే సంస్థ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్‌ను కూడా నియమించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications