Gold News: బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. మార్కెట్లో ధర కంటే తక్కువకే పసిడిని ఇన్వెస్టర్లకు అందించాలని నిర్ణయించింది. అయితే ఈ సదవకాశం పరిమిత రోజులకు మాత్రమే అందుబాటులో ఉంది.
అవును దేశంలో డిజిటల్ గోల్డ్ పెట్టుబడుల కోసం తెచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకం కింద 2023-24 రౌండ్ రేటును రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. దీని ప్రకారం తాజా ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,926గా నిర్ణయించారు. ఇది ప్రస్తుతం బంగారం మార్కెట్ ధర కంటే తక్కువ కూడా. డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం సోమవారం నుంచి ఇన్వెస్టర్లకు తెరవబడుతోంది.

జూన్ 19-23 వరకు నిర్వహిస్తున్న సిరీస్-1 సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి.. దానికి డిజిటల్ విధానంలో చెల్లింపు చేసే పెట్టుబడిదారులు ఇష్యూ ధర కంటే అదనంగా రూ.50 తగ్గింపును పొందుతారని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది. వారికి గ్రాము బంగారాన్ని రూ.5,876కే అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.
బాండ్స్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టే విధానాన్ని దేశంలో 2015లో భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ పేరుతో ప్రవేశపెట్టింది. బాండ్ విలువ మార్కెట్‌లోని బంగారం ధరతో ముడిపడి ఉంటుంది. ఇన్వెస్టర్లు దీని ప్రకారమే రాబడిని పొందుతారు. బాండ్స్ లాక్ ఇన్ పిరియడ్ 8 సంవత్సరాలుగా ఉంటుంది. కాలం ముగిసిన తర్వాత వీటిని రిడీమ్ చేసుకోవచ్చు లేదా సెకండరీ మార్కెట్లు విక్రయించుకోవచ్చు. ఇదే క్రమంలో బాండ్ హోల్డర్లు తమ పెట్టుబడిపై ఏడాదికి 2.5 శాతం చొప్పున వడ్డీ ఆదాయాన్ని కూడా పొందవచ్చు. వడ్డీ చెల్లింపు పెట్టుబడిదారుల రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications