Growth Report: పలు రంగాల్లో దేశం దినదినాభివృద్ధి చెందుతోంది. 77 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో పెనుమార్పులు సంభవించాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు టెక్నాలజీ, వైద్యం, ఎలక్ట్రికల్ సహా వివిధ రంగాలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఆయా రంగాల పనితీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల డేటా విడుదల చేసింది.
అగ్రరాజ్యాలు పేరుగాంచిన దేశాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. IT, వ్యవసాయం సహా వివిధ విభాగాల్లో భారత్ ముందడుగు వేస్తోంది. ఎదురొస్తున్న అడ్డంకులను ధీటుగా ఎదుర్కొంటూ.. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్, సెమీ కండక్టర్, ఫార్మా, విమానయానం, టెలికాం, సోలార్ రంగాల్లో ముందంజలో ఉంది.

దేశంలో సుమారు 144 కోట్ల జనాభా ఉండగా.. వారిలో 120 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. 114 కోట్ల మందికి సెల్ ఫోన్స్ ఉన్నాయి, 65 కోట్ల మంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఈ విభాగాలకు సంబంధించి గత దశాబ్ధ కాలంలో వచ్చిన గ్లోబలైజేషన్, కనెక్టివిటీ కారణంగా అంతర్జాతీయ విపణిలో ఇండియా ధీటుగా ముందడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇతర విషయాలను పరిశీలిస్తే.. ఇండియాలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇదే ట్రెండ్ మరో 50 ఏళ్లు కొనసాగుతుందని RBI అంచనా వేసింది. 25 ఏళ్ల లోపు వారు 40 శాతం పైగా ఉండగా.. వృద్ధులు కేవలం 7 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఇక UPI వినియోగదారులు 30 కోట్ల మంది ఉన్నారు. హెల్త్ ఇన్యూరెన్స్ యూజర్స్ 51 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ 3.5 కోట్ల మంది ఉన్నట్లు RBI నివేదించింది.


Click it and Unblock the Notifications